బీజేపీలో మరోసారి ఈటల ఎఫెక్ట్.. బండి సంజయ్ ప్లాన్ చేంజ్..!
దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర ఫస్ట్ ఫేజ్‌లో రెండు వారాలు మాత్రమే కొనసాగనుంది. ఈ నెల 24 నుంచి సెప్టెంబర్ 06 వరకు చేపట్టనున్న యాత్ర రూట్ మ్యాప్‌ను విడుదల చేశారు. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం నుంచి మెదక్ టౌన్ వరకు యాత్రను చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన పార్టీ రాష్ట్ర నాయకులు డీజీపీ మహేందర్ రెడ్డిని అనుమతి కోరారు. ఈటల ఎఫెక్ట్‌తో బండి సంజయ్ ఆలోచనలో పడ్డారు. హుజూరాబాద్ వరకు తొలి విడుత […]
దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ చేపట్టిన ప్రజాసంగ్రామ యాత్ర ఫస్ట్ ఫేజ్‌లో రెండు వారాలు మాత్రమే కొనసాగనుంది. ఈ నెల 24 నుంచి సెప్టెంబర్ 06 వరకు చేపట్టనున్న యాత్ర రూట్ మ్యాప్‌ను విడుదల చేశారు. చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం నుంచి మెదక్ టౌన్ వరకు యాత్రను చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించిన పార్టీ రాష్ట్ర నాయకులు డీజీపీ మహేందర్ రెడ్డిని అనుమతి కోరారు. ఈటల ఎఫెక్ట్‌తో బండి సంజయ్ ఆలోచనలో పడ్డారు. హుజూరాబాద్ వరకు తొలి విడుత పాదయాత్ర నిర్వహిస్తామని చెప్పిన కమిటీ సడన్‌గా ప్లాన్‌ను మార్చింది.
బీజేపీ తలపెట్టిన ప్రజాసంగ్రామ పాదయాత్ర ఫస్ట్ ఫేజ్‌లో రెండు వారాలు మాత్రమే కొనసాగనుంది. ఈ నెల 24 నుంచి సెప్టెంబర్ 06 వరకు హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మెదక్ జిల్లాలో మాత్రమే కొనసాగనుంది. భాగ్యలక్ష్మి ఆలయం దగ్గర మొదలైన పాదయాత్ర మెదక్ టౌన్లో ముగిసేలా రూట్ మ్యాప్‌ను సిద్ధం చేశారు. 14 రోజుల పాటు 234 కిలో మీటర్ల మేర పాదయాత్ర కొనసాగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు 30 కమిటీలను ఏర్పాటు చేశారు. 5 గ్రూపులుగా ఈ కమిటీలను విభజించి పాదయాత్రకు కావాల్సిన మౌళిక సదుపాయాలను ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రంలో బీజేపీ తొలిసారి చేపడుతున్న పాదయాత్రను పర్యవేక్షించేందుకు కేంద్ర కమిటీ నుంచి నలుగురు నేతలకు రాష్ట్రానికి రానున్నారు.
ఈటల ఎఫెక్టుతో ఆలోచనలో పడ్డ బండి సంజయ్..
ఎంతో ఉత్సాహంతో ప్రజాసంగ్రామ యాత్రను ప్రకటించిన బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఈటల ఎఫెక్ట్ తో ఆలోచనలో పడ్డారు. తొలివిడుత పాదయాత్ర హుజూరాబాద్ వరకు కొనసాగుతుందని ప్రకటించినప్పటికీ.. పాదయాత్ర కమిటీ సడన్‌గా రూట్ మ్యాప్‌ను చేంజ్ చేసింది. మెదక్ టౌన్ వరకు మాత్రమే తొలివిడత పాదయాత్ర ముగిసేలా షెడ్యూల్ ఖరారు చేశారు. ఈటల ఎఫెక్ట్ వలనే హుజూరాబాద్ లో పాదయాత్రను వాయిదా వేసినట్టుగా పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఈటల పాదయాత్రలో పాల్గొనే పరిస్థితులు లేనందునే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. వారం రోజుల్లో సెకండ్ ఫేజ్ పాదయాత్ర షెడ్యూల్ విడుదల చేస్తామని పాదయాత్ర ప్రముఖ్ మనోహర్ రెడ్డి ప్రకటించారు. రెండో విడుతలో హుజూరాబాద్‌లో పాదయాత్ర ఉండే అవకాశాలున్నాయి.
డీజీపీ అనుమతి కోరిన పార్టీ..
రాష్ట్రంలో తొలివిడుత పాదయాత్ర చేపట్టేందుకు అనుతులివ్వాలని బీజేపీ పార్టీ శ్రేణులు డీజీపీ మహేందర్ రెడ్డి సోమవారం అనుమతి కోరారు. రాష్ట్ర నాయకులతో పాటు జాతీయ స్థాయి నేతలు కూడా పాదయాత్రలో పాల్గొంటారని పాదయాత్ర ప్రముఖ్ మనోహర్ రెడ్డి వివరించారు. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ యాత్రను కొనసాగిస్తామన్నారు.
ఇవి కూడా చదవండి:
ఒక్కోచోట ఒక్కో మాట.. ‘దళితబంధు’ అమలు ఎలా?