టీఆర్ఎస్‌కు నో చాన్స్.. ఐదో రౌండ్‌లోనూ ఈటల ఆధిక్యం

దిశ, కరీంనగర్ సిటీ: హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితాల్లో మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ దూసుకెళ్తున్నారు. ప్రతీ రౌండ్‌లో ఆధిక్యం కనబర్చుతున్నారు. ముందుగా అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో ఆధిక్యం సాధించారు. అనంతరం టీఆర్ఎస్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఈటల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఫస్ట్ రౌండ్‌లో 166 ఓట్లు, రెండో రౌండ్‌లో 193 ఓట్లు, మూడో రౌండ్‌లో 914 ఓట్లు, నాలుగో రౌండ్‌లో 1695 ఓట్లు, […]

Update: 2021-11-02 00:48 GMT

దిశ, కరీంనగర్ సిటీ: హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితాల్లో మాజీ మంత్రి, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ దూసుకెళ్తున్నారు. ప్రతీ రౌండ్‌లో ఆధిక్యం కనబర్చుతున్నారు. ముందుగా అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లలో ఆధిక్యం సాధించారు. అనంతరం టీఆర్ఎస్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఈటల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఫస్ట్ రౌండ్‌లో 166 ఓట్లు, రెండో రౌండ్‌లో 193 ఓట్లు, మూడో రౌండ్‌లో 914 ఓట్లు, నాలుగో రౌండ్‌లో 1695 ఓట్లు, ఐదో రౌండ్‌లో 1825 ఓట్ల ఆధిక్యంలో ఈటల ముందంజలో ఉన్నారు. ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొని అనేక పథకాలు తీసుకొచ్చి, ఎత్తుకు పై ఎత్తులు వేసినా టీఆర్ఎస్‌కు అనూహ్య షాకులు తగులుతున్నాయి. ఇదిలావుంటే.. ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ప్రారంభించిన శాలపల్లిలోనూ బీజేపీకి ఆధిక్యం దక్కింది. శాలపల్లి ఓటర్లు అధికార పార్టీ టీఆర్ఎస్‌కు షాకిచ్చినట్లుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మా ఓటమికి కారణం ఆ గుర్తులే.. సాకులు వెతుక్కుంటోన్న పార్టీలు

Tags:    

Similar News