పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ
దిశ, మహబూబ్ నగర్: లాక్ డౌన్ కారణంగా జిల్లాలోని దామరగిద్ద మండల కేంద్రంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదలకు సంజయ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ మేరకు సంజయ్ చారిటబుల్ ట్రస్ట్, సంజయ్ ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ తరఫున 50 కుటుంబాలకు బియ్యం, కందిపప్పు, నూనే, మిర్చిపౌడర్, చింతపండు, ఇతర నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్, ఎంపీడీవో, ఎస్సై, ఎంపీపీ, ఇతర అధికారులు హాజరయ్యారు. దాతలు ముందుకు వచ్చి పేదలను […]
దిశ, మహబూబ్ నగర్: లాక్ డౌన్ కారణంగా జిల్లాలోని దామరగిద్ద మండల కేంద్రంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదలకు సంజయ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. ఈ మేరకు సంజయ్ చారిటబుల్ ట్రస్ట్, సంజయ్ ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ తరఫున 50 కుటుంబాలకు బియ్యం, కందిపప్పు, నూనే, మిర్చిపౌడర్, చింతపండు, ఇతర నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్, ఎంపీడీవో, ఎస్సై, ఎంపీపీ, ఇతర అధికారులు హాజరయ్యారు. దాతలు ముందుకు వచ్చి పేదలను ఆదుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు.
Tags: lockdown, corona, virus, damarigidda, sanjay charitable trust, sanjay indane, poor, essential goods,