మంత్రి వర్గం నుంచి ఎర్రబెల్లిని బర్తరఫ్ చేయాలి

దిశ, తెలంగాణ బ్యూరో : కేసీఆర్‌కు మహిళలపై గౌరవం ఉంటే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై లైంగిక వేధింపుల కేసు పెట్టి మంత్రి వర్గం నుంచి బర్త్ రఫ్ చేయాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. శుక్రవారం వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్‌లో నిర్వహించిన ప్రగతి గ్రామసభలో పాల్గొన్న ఎర్రబెల్లి ఓ మహిళా ఎంపీడీఓను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎర్రబెల్లి […]

Update: 2021-07-09 11:44 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : కేసీఆర్‌కు మహిళలపై గౌరవం ఉంటే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుపై లైంగిక వేధింపుల కేసు పెట్టి మంత్రి వర్గం నుంచి బర్త్ రఫ్ చేయాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. శుక్రవారం వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్‌లో నిర్వహించిన ప్రగతి గ్రామసభలో పాల్గొన్న ఎర్రబెల్లి ఓ మహిళా ఎంపీడీఓను ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖడించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎర్రబెల్లి మృగం కంటే దారుణంగా వ్యవహరించారని, ఒక మహిళా, గ్రూప్ వన్ ఆఫీసర్‌పై అనుచిత వ్యాఖ్యలు సభ్యత సంస్కారం లేకుండా చేశారంటే సాధారణ మహిళల పరిస్థితి ఏంటి ? అని ఆందోళన వ్యక్తం చేశారు. ఎర్రబెల్లి దయాకర్‌ని అంటే ప్రయోజనం లేదని, కేసీఆర్‌ని కాలర్ పట్టుకొని నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సభ్యత సంస్కారం, విద్యా బుద్దులు లేని ఎర్రబెల్లి లాంటి సన్నాసులని తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేని వారందరినీ మంత్రులని చేసి ప్రజలపై రుద్దుతున్న కేసీఆర్ నిలదీయాలన్నారు. మహిళా అధికారి పట్ల నీచంగా ప్రవర్తించిన ఎర్రబెల్లిపై కేసీఆర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలని డిమాండ్ చేశారు.

సెక్షన్ 354ఏ, 509ప్రకారం ఎర్రబెల్లి దయాకర్ వ్యాఖ్యలు ముమ్మాటికీ లైంగిక వేధింపులకు సంబంధించిన కేసు కిందకు వస్తాయని, మంత్రిపై లైంగిక వేధింపుల కేసుని నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టడం కాదని, మంత్రి పదవిలో ఉండి ఒక మహిళా అధికారిపై ఇంత అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రిపై చర్యలు తీసుకోకపొతే పోలీసులే దోషులుగా నిలబడాలన్నారు. సీఎం కేసీఆర్.. షీటీంని పంపించి సుమోటోగా కేసులు పెట్టి మంత్రిని అరెస్ట్ చేయాలని కోరారు.

ఎర్రబెల్లి బహిరంగ క్షమాపణ చెప్పాలి

మహిళలను చిన్న చూపు చూస్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెంటనే రాజీనామా చేయాలని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మహిళా అధ్యక్షురాలు సునీతరావు డిమాండ్ చేశారు. శుక్రవారం గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి మహిళల పట్ల ఎలాంటి గౌరవం లేదని, ఓ మహిళా అధికారిని పట్టుకొని అసభ్యంగా సంభోధించడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.

మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు బేషరతుగా , బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే మంత్రి కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. మహిళా గౌరవాన్ని కించపరిచేలా మాట్లాడిన ఎర్రబెల్లి కి రాబోయే కాలంలో మహిళా ఓటర్లు తగిన బుద్ధి చెప్తారన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ఆయనను కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు వదలబోరని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని మహిళలకు అండగా కాంగ్రెస్ మహిళా విభాగం ఉంటుందని స్పష్టం చేశారు.

Tags:    

Similar News