ఎర్రబెల్లి క్షమాపణలు చెప్పకుంటే.. ఆ పని చేస్తానంటున్న జడ్సన్
దిశ ప్రతినిధి, వరంగల్ : మహిళా అధికారిణిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, లేనిపక్షంలో హైదరాబాద్‌లోని ఆయన నివాసం ఎదుట రాజీనామా చేసేంత వరకు దీక్ష చేపడుతామని ఏఐసీసీ సభ్యుడు, మాజీ వికలాంగుల కార్పొరేషన్ చైర్మెన్ బక్క జడ్సన్ డిమాండ్ చేసారు. వరంగల్ అర్బన్ హన్మకొండలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జాతీయ మహిళా హక్కుల కమిషన్ ఈ విషయంపై విచారణ పూర్తి కాగానే మంత్రి ఎర్రబెల్లి పై […]
దిశ ప్రతినిధి, వరంగల్ : మహిళా అధికారిణిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, లేనిపక్షంలో హైదరాబాద్‌లోని ఆయన నివాసం ఎదుట రాజీనామా చేసేంత వరకు దీక్ష చేపడుతామని ఏఐసీసీ సభ్యుడు, మాజీ వికలాంగుల కార్పొరేషన్ చైర్మెన్ బక్క జడ్సన్ డిమాండ్ చేసారు.
వరంగల్ అర్బన్ హన్మకొండలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జాతీయ మహిళా హక్కుల కమిషన్ ఈ విషయంపై విచారణ పూర్తి కాగానే మంత్రి ఎర్రబెల్లి పై చర్యలు ఖాయమని జడ్సన్ స్పష్టం చేశారు. మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్యలు నిర్భయ చట్టంలోని ఒక సెక్షన్ కిందకు వస్తాయని జడ్సన్ పేర్కొన్నారు.