బోనం ఎత్తుకున్న మంత్రి ఎర్రబెల్లి.. అమ్మవార్లకు ప్రత్యేక పూజలు

దిశ, పాలకుర్తి : మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బుధవారం గ్రామ దేవతలకు మొక్కులు చెల్లించారు. పాలకుర్తి మండలంలోని దర్ధేపల్లి గ్రామ దేవత దండేమ్మతల్లికి ప్రత్యేక బోనం సమర్పించారు. అనంతరం పెదవంగర మండలం ఉప్పరగూడెం గ్రామంలో ముత్యాలమ్మ తల్లి, సీతారామ చంద్రస్వామి దేవాలయంలో నవగ్రహ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు గ్రామ దేవతల కంకణం దయాకర్ రావుకు కట్టి అమ్మవారి నైవేథ్యంను  మంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా దేవతల చల్లని చూపుతో  […]

Update: 2021-08-11 05:03 GMT

దిశ, పాలకుర్తి : మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బుధవారం గ్రామ దేవతలకు మొక్కులు చెల్లించారు. పాలకుర్తి మండలంలోని దర్ధేపల్లి గ్రామ దేవత దండేమ్మతల్లికి ప్రత్యేక బోనం సమర్పించారు. అనంతరం పెదవంగర మండలం ఉప్పరగూడెం గ్రామంలో ముత్యాలమ్మ తల్లి, సీతారామ చంద్రస్వామి దేవాలయంలో నవగ్రహ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు గ్రామ దేవతల కంకణం దయాకర్ రావుకు కట్టి అమ్మవారి నైవేథ్యంను మంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా దేవతల చల్లని చూపుతో రాష్ట్ర, నియోజకవర్గ ప్రజలు సంపూర్ణ ఆరోగ్యం, పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని అమ్మవార్లను వేడుకున్నట్లు మంత్రి తెలిపారు.

Tags:    

Similar News