‘ఇంగ్లాండ్ బెన్ స్టోక్స్ ఒక్కడిపైనే ఆధారపడి లేదు’

దిశ, స్పోర్ట్స్: బెన్ స్టోక్స్(Ben Stokes) ప్రపంచ అత్యుత్తమ క్రికెటర్ల(best cricketers in the world)లో ఒకడని మాకు తెలుసు, కానీ ఇంగ్లాండ్ జట్టు(England Team) అతని మీదనే ఆధారపడి(Depending) లేదని ఆ దేశ క్రికెటర్ ఓలీ పోప్(Cricketer Oli Pope) అభిప్రాయపడ్డాడు. వ్యక్తిగత కారణాల(personal reasons) ద్వారా పాకిస్తాన్‌తో జరుగనున్న తదుపరి రెండు టెస్టులకు బెన్ స్టోక్స్(Ben Stokes) దూరమయ్యాడు. ఇది ఇంగ్లాండ్ జట్టుకు పెద్ద ఎదురు దెబ్బ అని పలువురు భావిస్తుండటంతో ఓలీ పోప్ […]

Update: 2020-08-11 06:55 GMT

దిశ, స్పోర్ట్స్: బెన్ స్టోక్స్(Ben Stokes) ప్రపంచ అత్యుత్తమ క్రికెటర్ల(best cricketers in the world)లో ఒకడని మాకు తెలుసు, కానీ ఇంగ్లాండ్ జట్టు(England Team) అతని మీదనే ఆధారపడి(Depending) లేదని ఆ దేశ క్రికెటర్ ఓలీ పోప్(Cricketer Oli Pope) అభిప్రాయపడ్డాడు. వ్యక్తిగత కారణాల(personal reasons) ద్వారా పాకిస్తాన్‌తో జరుగనున్న తదుపరి రెండు టెస్టులకు బెన్ స్టోక్స్(Ben Stokes) దూరమయ్యాడు. ఇది ఇంగ్లాండ్ జట్టుకు పెద్ద ఎదురు దెబ్బ అని పలువురు భావిస్తుండటంతో ఓలీ పోప్ స్పందించాడు.

బెన్ స్టోక్స్ లేకపోయినా మా దగ్గర ప్రతిభకలిగిన క్రికెటర్లు(Talented Cricketers) ఇంకా చాలా మంది ఉన్నారని పోప్ స్పష్టం చేశాడు. ‘ప్రపంచంలోని అత్యుత్తమ క్రికెటర్లలో స్టోక్స్ ఒకడు. ఆట గతిని మార్చేయగల(Game changer) సత్తా అతడికి ఉంది. బ్యాట్, బాల్‌(Batting Bowling)తో అద్భుతం చేయకపోయినా, అతడు ఫీల్డ్‌(Field)లో ఉంటే ఇంగ్లాండ్ జట్టుకు అదనపు బలం అన్నది నిజమే. అయితే, అతనిపై మాత్రమే జట్టు ఆధారపడి లేదు’ అని ఓలీ పోప్ పేర్కొన్నాడు. కాగా, స్టోక్స్ ఈ వారంలో ఇంగ్లాండ్(England) నుంచి న్యూజిలాండ్(New Zealand) వెళ్లనున్నాడు. స్టోక్స్ తల్లిదండ్రులు న్యూజిలాండ్‌లోనే నివసిస్తారు. ప్రస్తుతం స్టోక్స్ తండ్రి(Stokes father) గెడ్ స్టోక్స్ అనారోగ్యం నుంచి కోలుకుంటున్నారు.

Tags:    

Similar News