ఫుట్‌బాల్‌కు క్రికెటర్ టాటా

ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు ఓపెనర్ రోరీ బర్న్స్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. తన క్రికెట్ కెరీర్ ముగిసే వరకు ఫుట్‌బాల్ ఆడకూడదని నిశ్చయించుకున్నాడు. దక్షిణాఫ్రికా జట్టుతో రెండోటెస్టుకు ముందు సహచర క్రికెటర్లతో ఫుట్‌బాల్ ఆడాడు. ఆటలో భాగంగా బంతిని గోల్ పోస్ట్ వైపు తన్నుతున్న క్రమంలో మోకాలికి గాయమైంది. గాయం తీవ్రత ఎక్కవగా ఉండటంతో శస్త్రచికిత్స కూడా జరిగింది. దీంతో కొన్నాళ్లపాటు క్రికెట్‌కు దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. టాపార్డర్‌లో నమ్మదగిన బ్యాట్స్‌మన్‌గా ఉన్న బర్న్స్ గాయం […]

Update: 2020-02-28 04:51 GMT

ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు ఓపెనర్ రోరీ బర్న్స్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. తన క్రికెట్ కెరీర్ ముగిసే వరకు ఫుట్‌బాల్ ఆడకూడదని నిశ్చయించుకున్నాడు. దక్షిణాఫ్రికా జట్టుతో రెండోటెస్టుకు ముందు సహచర క్రికెటర్లతో ఫుట్‌బాల్ ఆడాడు. ఆటలో భాగంగా బంతిని గోల్ పోస్ట్ వైపు తన్నుతున్న క్రమంలో మోకాలికి గాయమైంది. గాయం తీవ్రత ఎక్కవగా ఉండటంతో శస్త్రచికిత్స కూడా జరిగింది. దీంతో కొన్నాళ్లపాటు క్రికెట్‌కు దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

టాపార్డర్‌లో నమ్మదగిన బ్యాట్స్‌మన్‌గా ఉన్న బర్న్స్ గాయం కారణంగా ఆటకు దూరం కావడం ఇంగ్లాండ్ జట్టుకు గట్టి దెబ్బే. అతడు ఫిట్‌నెస్ సాధించడానికి ఇప్పుడు ఇంగ్లాండ్‌ డొమెస్టిక్ ఆడాల్సిన పరిస్థితి. అంతకన్నా ముందు అతను కనీసం నాలుగు నెలలపాటు విశ్రాంతి తీసుకోవాల్సిందే.

ఒక చిన్న పొరపాటు తన క్రికెట్ కెరీర్పైన పడటంతో ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ ఫుట్‌బాల్ జోలికి పోకూడదని నిర్ణయం తీసుకున్నాడు.

Tags:    

Similar News