ఇంగ్లాండ్, న్యూజిలాండ్ తొలి టెస్టు డ్రా

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య లండన్‌లోని లార్డ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. న్యూజిలాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 378 పరుగులకు ఆలౌట్ అయ్యింది. డెవాన్ కాన్వే (200), హెన్రీ నికోలస్ (61) రాణించగా మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. ఆఖర్లో నీల్ వాగ్నర్ (25) కాస్త పర్వాలేదనిపించాడు. తొలి టెస్టు ఆడుతున్న డెవాన్ కాన్వే (200) డబుల్ సెంచరీతో రికార్డు సృష్టించాడు. అరంగేట్రం బౌలర్ ఓలీ రాబిన్‌సన్ 4 […]

Update: 2021-06-06 20:25 GMT

దిశ, స్పోర్ట్స్ : ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్ల మధ్య లండన్‌లోని లార్డ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. న్యూజిలాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 378 పరుగులకు ఆలౌట్ అయ్యింది. డెవాన్ కాన్వే (200), హెన్రీ నికోలస్ (61) రాణించగా మిగతా బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. ఆఖర్లో నీల్ వాగ్నర్ (25) కాస్త పర్వాలేదనిపించాడు. తొలి టెస్టు ఆడుతున్న డెవాన్ కాన్వే (200) డబుల్ సెంచరీతో రికార్డు సృష్టించాడు. అరంగేట్రం బౌలర్ ఓలీ రాబిన్‌సన్ 4 వికట్లు తీశాడు. ఇక ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 275 పరుగులకు ఆలౌట్ అయ్యింది. రోరీ బర్న్స్ (132), జో రూట్ (42), ఓలీ రాబిన్‌సన్ (42) తప్ప మిగతా బ్యాట్స్‌మెన్ విపలమయ్యారు.

టిమ్ సౌథీ చెలరేగి 6 వికెట్లు తీశాడు. దీంతో కివీస్ జట్టుకు తొలి ఇన్నింగ్స్‌లో 103 పరుగుల ఆధిక్యం లభించింది. కివీస్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో తడబడింది. టామ్ లాథమ్ (36), డెవాన్ కాన్వే (23), రాస్ టేలర్ (33) కాస్త పర్వాలేదనిపించారు. కివీస్ జట్టు ఐదో రోజు లంచ్ సమయానికి 169/6 స్కోర్ వద్ద డిక్లేర్ చేసి ఇంగ్లాండ్ ముందు 70 ఓవర్లలో 273 పరగుల టార్గెట్ పెట్టింది. ఇంగ్లాండ్ ఓపెనర్ రోరీ బర్న్స్ (25), జాక్ క్రాలీ (2) త్వరగా ఔటయ్యారు. దీంతో 56 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి ఇంగ్లాండ్ కష్టాల్లో పడింది. అయితే ఆ తర్వాత ఇంగ్లాండ్ జట్టు మ్యాచ్ డ్రా చేయడానికే అన్నట్లు ఆడింది. కేవలం డిఫెన్స్ ఆడుతూ వికెట్లను మాత్రమే కాపాడుకుంటూ వచ్చింది.

ఈ క్రమంలో డామ్ సిబ్లే, జో రూట్ (40) కలసి మూడో వికెట్ కు 80 పరుగులు జోడించారు. ఇక జో రూట్ అవుటైన తర్వాత డామ్ సిబ్లే (60), ఓలీ పోప్ (20) కలసి మరో వికెట్ పడకుండా నిలకడగా ఆడారు. ఐదో రోజు సమయం ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 3 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది, ఫలితం తేలకపోవడంతో మ్యాచ్‌ను డ్రాగా ప్రకటించారు.

  • న్యూజీలాండ్ తొలి ఇన్నింగ్స్ 378 ఆలౌట్ (డేవన్ కాన్వే 200, ఓలీ రాబిన్‌సన్ 4 వికెట్లు)
  • ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ 275 ఆలౌట్ (రోరీ బర్న్స్ 132, టిమ్ సౌథీ 6 వికెట్లు)
  • న్యూజీలాండ్ 2వ ఇన్నింగ్స్ 169/6 డిక్లేర్డ్ (టామ్ లాథమ్ 36, ఓలీ రాబిన్‌సన్ 3 వికెట్లు)
  • ఇంగ్లాండ్ 2వ ఇన్నింగ్స్ (170/3 (డామ్ సిబ్లే 60 నాటౌట్, వాగ్నర్ 2 వికెట్లు)
Tags:    

Similar News