ఇంధన పొదుపుతో భావితరాలకు మేలు.. అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి.
దిశ, నాగర్‌కర్నూల్: భావితరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇంధన వృధాగా వాడకాన్ని విడనాడాలని జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి సూచించారు. గురువారం తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ లిమిటెడ్ ఆధ్వర్యంలో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు నిర్వహించారు. ఇందులో భాగంగా కలెక్టరేట్ ఆవరణలో ఇంధన పొదుపు పై అవగాహన కోసం ఎల్ఈడీ బల్బులు, ఎల్ఈడి ట్యూబ్ లైట్లు స్టాల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎక్కువ మంది విద్యుత్ అవసరమున్నా, […]
దిశ, నాగర్‌కర్నూల్: భావితరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇంధన వృధాగా వాడకాన్ని విడనాడాలని జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి సూచించారు. గురువారం తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ లిమిటెడ్ ఆధ్వర్యంలో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు నిర్వహించారు. ఇందులో భాగంగా కలెక్టరేట్ ఆవరణలో ఇంధన పొదుపు పై అవగాహన కోసం ఎల్ఈడీ బల్బులు, ఎల్ఈడి ట్యూబ్ లైట్లు స్టాల్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎక్కువ మంది విద్యుత్ అవసరమున్నా, లేకున్నా అతిగా వినియోగిస్తుంటారని, దానివల్ల అధిక లోడ్ పడి విద్యుత్ కొరత ఏర్పడుతోందన్నారు. జిల్లా అవసరాలకు కేటాయిస్తున్న విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవాలన్నారు. ప్రత్యామ్నాయ వనరుల వినియోగంపై దృష్టి పెట్టాలని శ్రీనివాస్ సూచించారు.
అలాగే ఉన్న నిల్వలను వృథా కాకుండా చూడాలన్నారు. ఎల్ఈడీ బల్బుల వాడకం ద్వారా ఇంధనం ఆదాతో పాటు విద్యుత్ చార్జీల ఆదా అవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఇంధన పొదుపు శాఖ జిల్లా మేనేజర్ జేఎస్ఎన్ మూర్తి, బీసీ వెల్ఫేర్ అధికారి అనిల్ ప్రకాష్, న్యాయవాదులు ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు.