ఈ కార్లు కనబడవు!

దిశ, వెబ్‌డెస్క్: కాలుష్య ఉద్గార నిబంధనల ప్రకారం ఏప్రిల్ 1 నుంచి బీఎస్-6 వాహనాల పరంపర మొదలు కానున్నాయి. అయితే, భారత రోడ్లపై రయ్‌మని దూసుకెళ్లే ప్రాచుర్యం పొందిన కొన్ని మోడల్ కార్లు ఇకమీదట కనబడవు. బీఎస్-4 ఇంధన కార్లకు కాలం చెల్లిపోతూండటం వల్ల పలు మోడల్ కార్లను నిలిపివేస్తున్నట్టు కార్ల తయారీ సంస్థలు వెల్లడించాయి. భవిష్యత్తులో ఉత్పత్తి చేయని మోడళ్లలో టయోటా నుంచి ఇటియోస్, కరొల్లా ఆల్టిస్, లివా మోడళ్లు ఉండగా, మహీంద్రా నుంచి కేయూవి […]

Update: 2020-03-13 07:03 GMT

దిశ, వెబ్‌డెస్క్: కాలుష్య ఉద్గార నిబంధనల ప్రకారం ఏప్రిల్ 1 నుంచి బీఎస్-6 వాహనాల పరంపర మొదలు కానున్నాయి. అయితే, భారత రోడ్లపై రయ్‌మని దూసుకెళ్లే ప్రాచుర్యం పొందిన కొన్ని మోడల్ కార్లు ఇకమీదట కనబడవు. బీఎస్-4 ఇంధన కార్లకు కాలం చెల్లిపోతూండటం వల్ల పలు మోడల్ కార్లను నిలిపివేస్తున్నట్టు కార్ల తయారీ సంస్థలు వెల్లడించాయి.

భవిష్యత్తులో ఉత్పత్తి చేయని మోడళ్లలో టయోటా నుంచి ఇటియోస్, కరొల్లా ఆల్టిస్, లివా మోడళ్లు ఉండగా, మహీంద్రా నుంచి కేయూవి 100 డీజిల్ వర్షన్, బొలెరో ప్లస్ మోడళ్లు, టాటా కంపెనీ నుంచి బాగా పాపులర్ అయిన హెక్సా, సఫారీ స్టార్మ్, జెస్ట్ బోల్ట్, వీటితో పలు పాత తరం మోడళ్లు మార్కెట్ల నుంచి కనుమరుగు కానున్నాయి. ఇక, దిగ్గజ ఆటో కంపెనీ మారుతీ సుజుకి నుంచి అన్ని రకాల డీజిల్ వేరియంట్లు, రెనాల్ట్ కారు రోడ్లమీద కనబడవు.

హ్యూండాయ్ కంపెనీ ఇప్పటికే తమ మోడళ్లను చాలావరకూ బీఎస్-6కి మార్చినందున ఇందులో ఎక్సెంట్ మోడల్ కారు మాత్రమే నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. అయితే, ఈ మోడల్‌కు రీప్లేస్‌గా ఎక్సెంట్ సీఎన్‌జీ అనే వేరియంట్‌ని హ్యూండాయ్ ప్రారంభించింది. సంబంధిత వర్గాల ప్రకారం…ఉత్పత్తి ఆగిపోనున్న మోడళ్ల కార్ల స్థానంలో సరికొత్త మోడళ్లను కంపెనీలు తీసుకురానున్నట్టు చెప్పాయి. అంతేకాకుండా ఆటో కంపెనీలు ఎక్కువగా డీజిల్ ఇంజిన్ వాహనాలను తగ్గించాలనే ప్రయత్నంలో ఉన్నాయని నిపుణులు అంటున్నారు.

ఇండియాలో అతిపెద్ద ఆటో తయారీ సంస్థ మారుతీ సుజుకీ, 2020, జనవరి నుంచే బీఎస్-6 వాహనాలను తయారు చేస్తోంది. మార్కెట్లో బాగా అమ్ముడుపోతున్న ఆల్టో, బలెనో వంటి మాస్ మోడల్ కార్లు 2019 ఏప్రిల్‌లోనే బీఎస్-6, పెట్రోల్ వెర్షన్‌కు అప్‌గ్రేడ్ చేయబడ్డాయి. వీటికి అనుగుణంగానే 2019 జూన్‌లో వాగన్ఆర్, స్విఫ్ట్, డిజైర్ మోడళ్లు, జులై నెలలో ఎర్టిగా, ఆగష్టులో ఎక్స్ఎల్-6, సెప్టెంబర్‌లో ఎస్-ప్రెసో, ఈ ఏడాది జనవరిలో ఎకో, సెలారియో, సూపర్ కేరీ, సియజ్, విటారా బ్రెజాను, ఫిబ్రవరిలో ఇగ్నిస్ కార్లను బీఎస్-6కు అప్‌గ్రేడ్ చేశారు. ‘గతేడాది నుంచే మా వినియోగదారులకు బీఎస్-4 డీజిల్ వాహనాలను నిలిపివేస్తున్నట్లు తెలియజేశాము. కాబట్టి ఎలాంటి అవరోధాలను ఎదుర్కోలేదు’ అని మార్కెటింగ్, సేలింగ్ ఎగ్జిక్యూటివ్ శశాంక్ తెలిపారు. టాటా మోటార్స్ కొత్త తరం కార్లు నెక్సాన్, ఆల్ట్రోజ్, టియాగో, టిగోర్, హారియర్, ఎలక్ట్రిక్ కార్ల విభాగంపై ఎక్కువ దృష్టి సారించనుంది.

Tags: BS-VI, Automotive Industry

Tags:    

Similar News