తెలంగాణలో యువ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం

దిశ తెలంగాణ బ్యూరో : యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. బుధవారం వి హబ్ ఆధ్వర్యంలో గ్రాడ్యుయేషన్ సెర్మోని ఈ కార్యక్రమం నిర్వహించారు. యువత ఏర్పాటు చేసిన వివిధ ఐడియాలతో సరికొత్త రూపకల్పనతో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను కేటీఆర్ పరిశీలించారు. వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి వీ హబ్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. కస్టమర్లకు నాణ్యమైన […]

Update: 2021-07-28 04:53 GMT

దిశ తెలంగాణ బ్యూరో : యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. బుధవారం వి హబ్ ఆధ్వర్యంలో గ్రాడ్యుయేషన్ సెర్మోని ఈ కార్యక్రమం నిర్వహించారు. యువత ఏర్పాటు చేసిన వివిధ ఐడియాలతో సరికొత్త రూపకల్పనతో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను కేటీఆర్ పరిశీలించారు. వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి వీ హబ్ ఏర్పాటు చేశామని వెల్లడించారు. కస్టమర్లకు నాణ్యమైన వస్తువులను అందజేయడంతో మన్ననలు పొందవచ్చని సూచించారు. దేశంలో 65 శాతం యువత 30 నుంచి 35 లోపే ఉన్నారని వారి పైన దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని పేర్కొన్నారు. సుమారు 1.3 బిలియన్ యువత ఉన్నట్లు తెలిపారు. భారత్ యంగ్ దేశమని కితాబిచ్చారు. యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి తెలంగాణ ప్రభుత్వం సహాయ సహకారాలు అందజేస్తోందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఐటీ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, దీప్తి యువ పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు.

Tags:    

Similar News