ఈ నెల 30 నుంచి ఎంసెట్ కౌన్సిలింగ్
దిశ, తెలంగాణ బ్యూరో: ఈ నెల 30 నుంచి ఎంసెట్ కౌన్సిలింగ్ చేపడుతామని ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి ప్రకటించారు. ఎంసెట్ పరీక్షా ఫలితాలను ఈ నెల 25న విడుదల చేయనున్నట్టుగా తెలిపారు. ఇంజనీరింగ్ విభాగానికి చెందిన విద్యార్థులు ఈ నెల 30 నుంచి సెప్టెంబర్ 09 వరకు ఆన్ లైన్ ఫీజు చెల్లించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు స్లాట్ బుక్ చేసుకోవల్సిందిగా సూచించారు. సెప్టెంబర్ 4 నుంచి 11 వరకు విద్యార్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ […]
దిశ, తెలంగాణ బ్యూరో: ఈ నెల 30 నుంచి ఎంసెట్ కౌన్సిలింగ్ చేపడుతామని ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి ప్రకటించారు. ఎంసెట్ పరీక్షా ఫలితాలను ఈ నెల 25న విడుదల చేయనున్నట్టుగా తెలిపారు. ఇంజనీరింగ్ విభాగానికి చెందిన విద్యార్థులు ఈ నెల 30 నుంచి సెప్టెంబర్ 09 వరకు ఆన్ లైన్ ఫీజు చెల్లించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు స్లాట్ బుక్ చేసుకోవల్సిందిగా సూచించారు. సెప్టెంబర్ 4 నుంచి 11 వరకు విద్యార్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుందని, సెప్టెంబర్ 4 నుంచి 13 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు. సెప్టెంబర్ 15న సీట్ల కేటాయింపులు చేపడుతామని, 15 నుంచి 20 వరకు విద్యార్థులు ఆన్ లైన్ లో సెల్ప్ రిపోర్టింగ్ చేయాలని చెప్పారు. రెండో విడుత కౌన్సిలింగ్ తేదీలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు.