ఏదో దాస్తున్నారు : శరద్ పవార్
ఎల్గర్ పరిషత్ కేసును కేంద్రం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు అప్పగించడం ద్వారా మహారాష్ట్రలో అప్పటి ఫడ్నవీస్ ప్రభుత్వం ఏదో దాచాలనుకుంటోందని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఆరోపించారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే నెపంతో మానవ హక్కుల కార్యకర్తలను అరెస్టు చేశారు. ఈ కేసు దర్యాప్తుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఏర్పాటు చేయాలని పవార్ గతంలో డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే కేంద్రం ఈ కేసును ఎన్ఐఏకు అప్పగించే ముందు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి ఉండాల్సిందని […]
ఎల్గర్ పరిషత్ కేసును కేంద్రం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు అప్పగించడం ద్వారా మహారాష్ట్రలో అప్పటి ఫడ్నవీస్ ప్రభుత్వం ఏదో దాచాలనుకుంటోందని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఆరోపించారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే నెపంతో మానవ హక్కుల కార్యకర్తలను అరెస్టు చేశారు. ఈ కేసు దర్యాప్తుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఏర్పాటు చేయాలని పవార్ గతంలో డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. అయితే కేంద్రం ఈ కేసును ఎన్ఐఏకు అప్పగించే ముందు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి ఉండాల్సిందని అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే అది ‘జాతి వ్యతిరేక చర్యా’ అని ప్రశ్నించారు. కోరెగాం – భీమా అల్లర్లు చెలరేగినపుడు మహారాష్ట్రలో ఫడ్నవీస్ ప్రభుత్వమే అధికారంలో ఉందన్నారు. ప్రస్తుతం కేంద్రం ఈ కేసును ఎన్ఐఏకు అప్పగించడం చూస్తుంటే..ఫడ్నవీస్ ప్రభుత్వం ఏదో దాచాలనుకుంటున్నట్టు కనబడుతోందని పవార్ తెలిపారు.