ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలకు అవగాహన అవసరం

దిశ, వెబ్‌డెస్క్: దేశీయంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను ప్రజలు కొనేలా సబ్సిడీలతో పాటు సరైన అవగాహన అవసరమని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అభిప్రాయపడింది. కొవిడ్-19 మహమ్మారి కొనసాగుతున్న పరిస్థితుల మధ్య దేశీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 15-17 శాతం తగ్గిపోతాయని ఇక్రా పేర్కొంది. ప్రజల్లో ఆరోగ్య భయాలతో పాటు ఆర్థికపరమైన ఆందోళనలు ప్రాథమిక కారణాలని ఇక్రా తెలిపింది. ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) కొనుగోళ్లను పెంచేందుకు ప్రభుత్వం ఫేమ్2 పథకం లక్ష్యంలో కేవలం 2 […]

Update: 2020-12-21 08:07 GMT

దిశ, వెబ్‌డెస్క్: దేశీయంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలను ప్రజలు కొనేలా సబ్సిడీలతో పాటు సరైన అవగాహన అవసరమని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అభిప్రాయపడింది. కొవిడ్-19 మహమ్మారి కొనసాగుతున్న పరిస్థితుల మధ్య దేశీయ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల అమ్మకాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 15-17 శాతం తగ్గిపోతాయని ఇక్రా పేర్కొంది. ప్రజల్లో ఆరోగ్య భయాలతో పాటు ఆర్థికపరమైన ఆందోళనలు ప్రాథమిక కారణాలని ఇక్రా తెలిపింది. ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) కొనుగోళ్లను పెంచేందుకు ప్రభుత్వం ఫేమ్2 పథకం లక్ష్యంలో కేవలం 2 శాతం మాత్రమే సాధించగలిగింది.

ప్రభుత్వం ఫేమ్2 పథకాన్ని మూడేళ్ల కాలంలో మొత్తం 10 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించేలా ప్రోత్సహిస్తోంది. ఈ ఏడాది సెప్టెంబర్ 30తో సగం కాలం పూర్తయినప్పటికీ అందులో 2 శాతం లక్ష్యమే నెరవేరిందని ఇక్రా పేర్కొంది. ఈ ఆర్థిక సంవత్సరంలో కరోనా వల్ల డిమాండ్ ఉన్నప్పటికీ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కొనుగోళ్లు ఆశించిన స్థాయిలో జరగలేదు. పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాల లోటు దీనికి కారణం అవొచ్చని ఇక్రా స్పష్టం చేసింది. ఫేమ్2 పథకం కింద సబ్సీడీ అవకాశం ఉన్నప్పటికీ స్థానికీకరణ, వినియోగదారుల్లో అవగాహన లేకపోవడం, ఉత్పత్తి పరిజ్ఞానం తక్కువగా ఉండటం, అమ్మకాల తర్వాత సర్వీసు లోపాలు ఉండటం ఈ పథకం పేలవమైన పనితీరుకు ప్రధాన కారణాలని ఇక్రా వివరించింది.

Tags:    

Similar News