బీజేపీపై ప్రశాంత్ కిషోర్ సెన్సేషనల్ కామెంట్స్

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల జోరు మొదలైంది. వచ్చే ఏడాది జరుగబోయే ఈ ఎన్నికలను పలు పార్టీలు ప్రతిష్టాత్మంగా తీసుకున్నాయి. ఎలాగైనా విజయం సాధించాలని అన్ని పార్టీలు ఇప్పటికే కసరత్తు మొదలెట్టాయి. ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ తరపున ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు. తాజాగా పీకే బీజేపీపై సంచలన కామెంట్ చేశారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. బీజేపీ ఎన్ని ఎత్తులు వేసినా, పది సీట్లు కూడా గెలుచుకోలేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. […]

Update: 2020-12-21 01:31 GMT

దిశ, వెబ్‌డెస్క్: పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల జోరు మొదలైంది. వచ్చే ఏడాది జరుగబోయే ఈ ఎన్నికలను పలు పార్టీలు ప్రతిష్టాత్మంగా తీసుకున్నాయి. ఎలాగైనా విజయం సాధించాలని అన్ని పార్టీలు ఇప్పటికే కసరత్తు మొదలెట్టాయి. ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ తరపున ప్రశాంత్ కిషోర్ ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరిస్తున్నారు. తాజాగా పీకే బీజేపీపై సంచలన కామెంట్ చేశారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. బీజేపీ ఎన్ని ఎత్తులు వేసినా, పది సీట్లు కూడా గెలుచుకోలేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మళ్లీ మమతా బెనర్జీనే విజయం సాధిస్తారని అన్నారు. అంతేగాకుండా బెంగాల్‌లో బీజేపీకి డబుల్ డిజిట్ కంటే ఎక్కువ సీట్లు వస్తే.. తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు. కాగా 2014 ఎన్నికల నుంచి ప్రశాంత్ కిషోర్ అనేక పార్టీలకు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించారు. ఈ ఏడాది బీహార్‌లో జరిగిన ఎన్నికల్లో ఆర్జేడీకి ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ వ్యవహరించారు. కానీ, ఆర్జేడీ పరాజయం పాలైంది. మరి ఈసారి ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News