తదుపరి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆయనే
దిశ, వెబ్‌డెస్క్ : దేశ రాజ్యాంగ వ్యవస్థలలో కీలకమైన ఎన్నికల కమిషన్‌కు కొత్త బాస్ రానున్నారు. ప్రస్తుతం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) గా ఉన్న సునీల్ అరోరా పదవీకాలం త్వరలో ముగుస్తుండటంతో ఆయన వారసుడు ఎవరనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్నికల కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్న సునీల్ చంద్ర.. తదుపరి సీఈసీగా నియమితులయ్యే అవకాశం ఉంది. ఈసీలో సీనియర్ మోస్ట్ ఆఫీసర్ అయిన సునీల్ చంద్ర నియామకం లాంచనమే అయినా.. అధికారిక […]
దిశ, వెబ్‌డెస్క్ : దేశ రాజ్యాంగ వ్యవస్థలలో కీలకమైన ఎన్నికల కమిషన్‌కు కొత్త బాస్ రానున్నారు. ప్రస్తుతం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) గా ఉన్న సునీల్ అరోరా పదవీకాలం త్వరలో ముగుస్తుండటంతో ఆయన వారసుడు ఎవరనే ఆసక్తి అందరిలోనూ మొదలైంది.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఎన్నికల కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్న సునీల్ చంద్ర.. తదుపరి సీఈసీగా నియమితులయ్యే అవకాశం ఉంది. ఈసీలో సీనియర్ మోస్ట్ ఆఫీసర్ అయిన సునీల్ చంద్ర నియామకం లాంచనమే అయినా.. అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. నేడో, రేపో దీనిపై కేంద్రం ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు సమాచారం. ఐఆర్ఎస్ ఆఫీసర్ అయిన సుశీల్ చంద్ర.. 2019లో లోక్‌సభ ఎన్నికలకు ముందు (2019, ఫిబ్రవరి 15) ఈసీలో ఎన్నికల కమిషనర్‌గా నియమితులయ్యారు. కాగా తదుపరి సీఈసీగా ఎన్నికైతే ఈ పదవిలో ఆయన 2022 వరకు కొనసాగుతారు. ఈసీ వచ్చే ఏడాది గోవా, మణిపూర్, ఉత్తరాఖండ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్ లలో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనుంది.