వ్యాక్సిన్ కోసం వెళ్లి.. మృత్యుఒడికి

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం ఒక వృద్ధుడు మృతి చెందిన విషాదకర ఘటన జార్ఖండ్‌లోని రాంచీలో చోటుచేసుకుంది. జేతు రాయ్ కోటర్వ్(60) అనే వృద్ధుడు కరోనా వ్యాక్సిన్ తీసుకునేందుకు తన గ్రామం నుంచి 10 కిలోమీటర్లు నడిచి సిమ్‌దెగా జిల్లాలోని వ్యాక్సిన్ సెంటర్‌కి చేరుకున్నాడు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ తొలి డోస్ తీసుకున్న అనంతరం వృద్ధుడు సృహాతప్పి కింద పడిపోయాడు. ఆ సమయంలో అధికారులు సమీపంలోని హాస్పిటల్‌కు తరలించారు. ఈ క్రమంలో మెరుగైన చికిత్స కోసం […]

Update: 2021-03-21 02:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వ్యాక్సిన్ తీసుకున్న అనంతరం ఒక వృద్ధుడు మృతి చెందిన విషాదకర ఘటన జార్ఖండ్‌లోని రాంచీలో చోటుచేసుకుంది. జేతు రాయ్ కోటర్వ్(60) అనే వృద్ధుడు కరోనా వ్యాక్సిన్ తీసుకునేందుకు తన గ్రామం నుంచి 10 కిలోమీటర్లు నడిచి సిమ్‌దెగా జిల్లాలోని వ్యాక్సిన్ సెంటర్‌కి చేరుకున్నాడు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ తొలి డోస్ తీసుకున్న అనంతరం వృద్ధుడు సృహాతప్పి కింద పడిపోయాడు. ఆ సమయంలో అధికారులు సమీపంలోని హాస్పిటల్‌కు తరలించారు.

ఈ క్రమంలో మెరుగైన చికిత్స కోసం రాంచీలోని రిమ్స్ హాస్పిటల్‌కి తరలించేలోపు వృద్ధుడు మరణించాడు. వ్యాక్సిన్ వృద్ధుడు రోగనిరోధకశక్తిపై ప్రతికూల ప్రభావం చూపి మరణించాడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ దీనిపై అధికారుల నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు.

Tags:    

Similar News