రెచ్చగొట్టి చావుదెబ్బతిన్న పాక్..
దిశ, వెబ్‌డెస్క్ : సరిహద్దుల వెంబడి కాల్పులకు తెగబడుతున్న పాక్ ఆర్మీకి భారత బలగాలు గట్టిగా బుద్ధిచెప్పాయి. భద్రతా బలగాలు జరిపిన ప్రతిదాడిలో 8 మంది పాక్ సైనికులు హతమయ్యారు. వీరిలో ఇద్దరు నుంచి ముగ్గురు వరకూ ఆర్మీ స్పెషల్ సర్వీస్ గ్రూప్ (ఎస్ఎస్‌జీ) కమెండోలు ఉన్నట్లు ‘ఏఎన్ఐ’ వార్తాసంస్థ పేర్కొంది. పాక్ ఆర్మీ పోస్టులే లక్ష్యంగా భారత్ ఆర్మీ మిస్సైల్స్ తో దాడి చేయడంతో సుమారు 10 నుంచి 12మంది వరకూ పాక్ సైనికులు గాయపడ్డారు.పెద్ద ఎత్తున […]
దిశ, వెబ్‌డెస్క్ : సరిహద్దుల వెంబడి కాల్పులకు తెగబడుతున్న పాక్ ఆర్మీకి భారత బలగాలు గట్టిగా బుద్ధిచెప్పాయి. భద్రతా బలగాలు జరిపిన ప్రతిదాడిలో 8 మంది పాక్ సైనికులు హతమయ్యారు. వీరిలో ఇద్దరు నుంచి ముగ్గురు వరకూ ఆర్మీ స్పెషల్ సర్వీస్ గ్రూప్ (ఎస్ఎస్‌జీ) కమెండోలు ఉన్నట్లు ‘ఏఎన్ఐ’ వార్తాసంస్థ పేర్కొంది. పాక్ ఆర్మీ పోస్టులే లక్ష్యంగా భారత్ ఆర్మీ మిస్సైల్స్ తో దాడి చేయడంతో సుమారు 10 నుంచి 12మంది వరకూ పాక్ సైనికులు గాయపడ్డారు.పెద్ద ఎత్తున బంకర్లు, ఇంధన డంప్‌లు, లాంచ్ ప్యాడ్లను కూడా ఇండియన్ ఆర్మీ ధ్వంసం చేసింది.
తరచుగా కవ్వింపులకు పాల్పడే పాకిస్థాన్ శుక్రవారం నేరుగా కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల్లో ఒక బీఎస్ఎఫ్ సబ్ ఇన్‌స్పెక్టర్ సహా నలుగురు భారత సైనికులు అమరులయ్యారు. గురెజ్, ఉరి సెక్టార్ నుంచి వెలువడిన సమాచారం ప్రకారం మరో నలుగురు సాధారణ పౌరులు కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది.
In Video, Pak Bunker Destroyed With 3 Rockets Fired By India https://t.co/tOPLJ2z511 pic.twitter.com/bYeuXvzGUR
— NDTV (@ndtv) November 13, 2020