ఐషర్ మోటార్స్ వాణిజ్య వాహనాల అమ్మకాల్లో 84 శాతం క్షీణత

దిశ, వెబ్‌డెస్క్: ఐషర్ మోటార్స్ లిమిటెడ్(Eicher Motors Limited) 2020-21 ఆర్థిక సంవత్సరంలో జూన్ త్రైమాసికానికి ప్రతికూల ఫలితాలను నమోదు చేసింది. సంస్థ ద్విచక్ర వాహనాల(Two-wheelers) విభాగంలో అమ్మకాలు మూడో వంతుకు పడిపోయాయి. వాణిజ్య వాహనాల(commercial vehicles) అమ్మకాలు ఆర్థిక మాంద్యం, లాక్‌డౌన్ ప్రభావంతో 84 శాతం తగ్గాయని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌(Regulatory Filing)లో తెలిపింది. సంస్థ ద్విచక్ర వాహన విభాగం రాయల్ ఎన్‌ఫీల్డ్(Royal Enfield) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో రూ. 55 కోట్ల […]

Update: 2020-08-13 11:40 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఐషర్ మోటార్స్ లిమిటెడ్(Eicher Motors Limited) 2020-21 ఆర్థిక సంవత్సరంలో జూన్ త్రైమాసికానికి ప్రతికూల ఫలితాలను నమోదు చేసింది. సంస్థ ద్విచక్ర వాహనాల(Two-wheelers) విభాగంలో అమ్మకాలు మూడో వంతుకు పడిపోయాయి. వాణిజ్య వాహనాల(commercial vehicles) అమ్మకాలు ఆర్థిక మాంద్యం, లాక్‌డౌన్ ప్రభావంతో 84 శాతం తగ్గాయని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌(Regulatory Filing)లో తెలిపింది.

సంస్థ ద్విచక్ర వాహన విభాగం రాయల్ ఎన్‌ఫీల్డ్(Royal Enfield) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో రూ. 55 కోట్ల నష్టాలను నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఇది రూ. 452 కోట్ల లాభాలను వెల్లడించింది. ఇక, సమీక్షించిన త్రైమాసికంలో ఆదాయం(Income) 66 శాతం తగ్గి రూ. 818 కోట్లకు చేరుకోగా, వడ్డీ, పన్ను, తరుగుదలకు ముందు ఆదాయాలు 99 శాతం క్షీణించి రూ. 4 కోట్లకు చేరుకున్నాయి. స్వీడన్‌కు చెందిన వోల్వో(Volvo) కంపెనీతో ఐషర్ మోటార్స్ సంస్థ (Eicher Motors Company)జాయింట్ వెంచర్ బిజినెస్ వీఈ కమర్షియల్ వెహికల్స్(VE Commercial Vehicles) అమ్మకాలు సంకోచం కారణంగా నష్టాలు ఎక్కువగా నమోదైనట్టు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సిద్ధార్థ లాల్ చెప్పారు. ద్విచక్ర వాహనాల విభాగంలో మాదిరిగా వాణిజ్య వాహనాల (commercial vehicles)పరిశ్రమ వృద్ధి సాధించలెదని ఆయన తెలిపారు.

Tags:    

Similar News