‘గెల్లు’కు సొంత పార్టీలోనే సెగ.. టికెట్ రాకుండా ఎమ్మెల్యే అడ్డగింత
దిశ, తెలంగాణ బ్యూరో : హుజురాబాద్ ఉప ఎన్నిక అధికార పార్టీలో చిచ్చు పెడుతోంది. హుజురాబాద్టికెట్ గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు ఖరారైందనే నేపథ్యంలో ఒక వర్గం అడ్డుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. మంత్రి కేటీఆర్ కోటరీలోని ఓ కీలక నాయకుడు ఈ బాధ్యతలను భుజాలపై వేసుకున్నారు. విద్యార్థి నేతగా టీఆర్ఎస్‌లో గుర్తింపు పొంది, ప్రస్తుతం ఓ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న సదరు నాయకుడు గెల్లు శ్రీనివాస్‌కు టికెట్ ఇవ్వకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థి […]
దిశ, తెలంగాణ బ్యూరో : హుజురాబాద్ ఉప ఎన్నిక అధికార పార్టీలో చిచ్చు పెడుతోంది. హుజురాబాద్టికెట్ గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు ఖరారైందనే నేపథ్యంలో ఒక వర్గం అడ్డుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది. మంత్రి కేటీఆర్ కోటరీలోని ఓ కీలక నాయకుడు ఈ బాధ్యతలను భుజాలపై వేసుకున్నారు. విద్యార్థి నేతగా టీఆర్ఎస్‌లో గుర్తింపు పొంది, ప్రస్తుతం ఓ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న సదరు నాయకుడు గెల్లు శ్రీనివాస్‌కు టికెట్ ఇవ్వకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం విద్యార్థి సంఘం తరుపున యూనివర్సిటీలో ఉద్యమానికి నాయకత్వం వహించిన తనకు మినహా మరెవ్వరికీ ప్రభుత్వంలో ప్రాధాన్యం ఉండరాదనే కోణంలో గెల్లుకు అడ్డుపుల్ల వేస్తున్నారు.
ఆయన గెలువడు సార్..!
హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి అభ్యర్థి కోసం టీఆర్ఎస్ అష్టకష్టాలు పడుతోంది. ఇప్పటికీ ఎవరికి టికెట్ఇస్తారనేది తేలడం లేదు. అయితే ఇటీవల గెల్లు శ్రీనివాస్ యాదవ్ పేరు ఖరారైనట్లు తెలంగాణ భవన్‌నుంచి లీకైంది. అంతేకాకుండా హుజురాబాద్ నేతలతో మంత్రి హరీశ్‌రావు ఇటీవల సిద్దిపేటలో వరుస సమావేశాలను నిర్వహిస్తున్నారు. ఈ సమావేశాల్లో గెల్లు శ్రీనివాస్ ప్రధానంగా ఉండటం, ఆయనకు టికెట్ఇచ్చే చాన్స్ ఉందంటూ టీఆర్ఎస్‌లోని ఒక వర్గం ప్రచారం చేస్తోంది. ఈ నేపథ్యంలో మాజీ విద్యార్థి నేతలు గెల్లుకు అడ్డుపుల్ల వేస్తున్నట్లు తెలుస్తోంది. మంత్రి కేటీఆర్‌తో సన్నిహితంగా ఉంటే సదరు విద్యార్థి నేత, ఎమ్మెల్యే శ్రీనివాస్‌కు టికెట్ ఇస్తే అక్కడ బీజేపీకి గెలుపుకు అవకాశం ఇచ్చినట్లే అవుతుందని బాహాటంగానే చెప్పుతున్నట్లు సమాచారం.
ప్రస్తుతం గెల్లు శ్రీనివాస్‌కు హుజురాబాద్ ప్రాంతం నేతలతో సంబంధం లేదని, ఇక్కడ విద్యార్థి సంఘంలో మాత్రమే పరిచయాలున్నాయని, అక్కడ కొత్త అభ్యర్థిగా చూసే అవకాశం ఉందని, దీంతో ఆయనకు ఓట్లు వేయరంటూ ప్రచారం చేపిస్తున్నారని పార్టీ వర్గాలు చెప్పుతున్నాయి. వాస్తవంగా గత కొంతకాలం కిందట వరకు కౌశిక్‌రెడ్డి లేదా పెద్దిరెడ్డికి టికెట్ వస్తుందనే ధీమాతో పార్టీ నేతలున్నారు. కానీ కౌశిక్‌రెడ్డికి గవర్నర్‌కోటా ఎమ్మెల్సీ అవకాశం రావడంతో ఇక బీసీ వర్గానికే టికెట్ ఇస్తారని భావిస్తున్నారు. అయితే కాంగ్రెస్ నుంచి చేరిన స్వర్గం రవి, టీఆర్ఎస్ నేత పొనగంటి మల్లయ్యతో పాటు గెల్లు శ్రీనివాస్ పేరు కూడా ప్రచారంలో ఉంది. వీణవంకకు చెందిన గెల్లు శ్రీనివాస్ తనకు టికెట్ ఇవ్వాలంటూ పార్టీ పెద్దలను వేడుకుంటున్నాడు.
వద్దంటే వద్దు
కాగా గెల్లుకు వ్యతిరేకంగా టీఆర్ఎస్‌లోని మరో వర్గం ప్రచారానికి దిగింది. దీనికి ఓ విద్యార్థి నేత సూత్రదారుడిగా ఉన్నట్లు తెలంగాణ భవన్‌లో టాక్. ఎందుకంటే టీఆర్ఎస్ అనుబంధ విద్యార్థి సంఘం నుంచి ఇద్దరు నేతలు శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తుండగా… ఒక ఎమ్మెల్యే మాత్రం అటు సీఎం కేసీఆర్, ఇటు మంత్రి కేటీఆర్ కోటరీలోనూ కీలకంగా ఉంటున్నారు. ఇప్పుడు అదే విద్యార్థి సంఘం నేతగా ఉన్న గెల్లు శ్రీనివాస్‌కు హుజురాబాద్ టికెట్ ఖరారై, ఒకవేళ గెలిస్తే తనకు పోటీగా ఈ కోటరీల్లో ఉంటాడనే భయం వెంటాడుతోంది. ఈ కారణంగానే ఆయనకు టికెట్ రాకుండా ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. ఇప్పటికే మంత్రి కేటీఆర్‌కు పదేపదే ఈ విషయంపై ఫిర్యాదు చేస్తున్నట్లు గులాబీ నేతలే గుసగుసలాడుకుంటున్నారు.