వివాదంలో ‘ఈషో’ మూవీ… అడ్డుకుంటానన్న మాజీ ఎమ్మెల్యే
దిశ, సినిమా : మలయాళం మూవీ ‘ఈషో – నాట్ ఫ్రమ్ ది బైబిల్’ చిక్కుల్లో పడింది. జయసూర్య టైటిల్ క్యారెక్టర్ ప్లే చేస్తున్న సినిమా ఈ చిత్రానికి నదీర్షా దర్శకులు కాగా.. కాంట్రవర్సీ క్రియేట్ చేసింది. సినిమాలో ఈషో(జీసస్) పేరుతో ఉన్న క్యారెక్టర్ నెగెటివ్ షేడ్స్‌తో ఉందని.. తద్వారా క్రిస్టియన్ల మనోభావాలు దెబ్బతీస్తున్నారని ఫైర్ అయ్యారు కేరళ మాజీ ఎమ్మెల్యే పీసీ జార్జ్. టైటిల్ చేంజ్ చేయకపోతే మూవీ రిలీజ్ అడ్డుకుంటామని హెచ్చరించిన ఆయన.. దీని […]
దిశ, సినిమా : మలయాళం మూవీ ‘ఈషో – నాట్ ఫ్రమ్ ది బైబిల్’ చిక్కుల్లో పడింది. జయసూర్య టైటిల్ క్యారెక్టర్ ప్లే చేస్తున్న సినిమా ఈ చిత్రానికి నదీర్షా దర్శకులు కాగా.. కాంట్రవర్సీ క్రియేట్ చేసింది. సినిమాలో ఈషో(జీసస్) పేరుతో ఉన్న క్యారెక్టర్ నెగెటివ్ షేడ్స్‌తో ఉందని.. తద్వారా క్రిస్టియన్ల మనోభావాలు దెబ్బతీస్తున్నారని ఫైర్ అయ్యారు కేరళ మాజీ ఎమ్మెల్యే పీసీ జార్జ్. టైటిల్ చేంజ్ చేయకపోతే మూవీ రిలీజ్ అడ్డుకుంటామని హెచ్చరించిన ఆయన.. దీని గురించి రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేస్తామన్నారు. క్రిస్టియన్ అసోసియేషన్స్ ఇందుకు వ్యతిరేకంగా నిరసనలకు దిగేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.
కాగా దీనిపై స్పందించిన డైరెక్టర్ నదీర్షా.. టైటిల్ చేంజ్ చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ట్యాగ్ లైన్ నాట్ ఫ్రమ్ ది బైబిల్ మాత్రం తీసేస్తామని తెలిపారు. ఈషో టైటిల్ ఫస్ట్ లుక్ రిలీజై మూడు నెలలు అవుతుందని, అప్పుడు వ్యతిరేకించని వారు ఇప్పుడెందుకు ఇలా చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. క్రిస్టియన్ సోదరుల మనోభావాలు దెబ్బతీసే ఉద్దేశం తమకు లేదన్న డైరెక్టర్.. కెమెరా మెన్ రాబీ వర్ఘీస్ ఈ టైటిల్ సజెస్ట్ చేశారని వివరించారు. ఇక తన కొత్త చిత్రం ‘కేశు ఈ వీడింతె నధన్’ లో లీడ్ క్యారెక్టర్ నేమ్ కేశు(కేశవన్) అని, ఈ పేరుతో యేసును రిఫర్ చేయొద్దని సూచించాడు. కేశు, యేసు పేర్లకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశాడు. ఈ కాంట్రవర్సీలు ఎలా చెలరేగాయో తనకు తెలియదన్న నదీర్షా… లౌకిక వాదాన్ని విశ్వసించే భారతీయ పౌరుడిగా, బాధ్యతాయుతమైన ఆర్టిస్టుగా, తన సినిమాల్లో ఇతరుల మత భావాలను దెబ్బతీసే కంటెంట్ ఉండదని తెలిపారు.