పెళ్లి కాకుండానే ఇద్దరు పిల్లలా?.. ఒక్కసారిగా షాకిచ్చిన Eesha Rebba.. తండ్రెక్కడ అంటూ ప్రశ్నించిన Suma!
నటన, అందంతో మొదట్లో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుని.. అందరి దష్టిని ఆకర్షించింది ఈషా రెబ్బా.
దిశ,వెబ్‌డెస్క్: నటన, అందంతో మొదట్లో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుని.. అందరి దష్టిని ఆకర్షించింది ఈషా రెబ్బా. ‘దర్శకుడు’, ‘అ’, ‘బ్రాండ్ బాబు’, ‘అరవింద సమేత’ ‘వీరరాఘవ’, ‘సుబ్రమణ్యపురం’, ‘రాగల24 గంటల్లో’ లాంటి సినిమాల్లో నటించింది. ఆ తర్వాత సినిమాలు పెద్దగా హిట్ కాకపోవడంతో దర్శక, నిర్మాతలు ఈ హీరోయిన్ను పట్టించుకోవడం మానేశారు. దీంతో ‘3 రోజెస్, ‘పిట్టకథలు, మయాబజార్ లాంటి ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ భామ జేడీ చక్రవర్తితో ‘దయా’ వెబ్ సిరీస్‌లో నటిస్తుంది.
అయితే తాజాగా ఈ టీమ్ ఈషా రెబ్బాతోపాటు రవి వర్మ, జెస్సీ, గౌతమి చెల్లాగుల్లా.. సుమ యాంకర్‌గా చేసే ‘సుమ అడ్డా’ షోకి హాజరయ్యారు. తమదైన డాన్సులు, చిలిపి ఆన్సర్లు, పంచ్ డైలాగ్‌లతో ఆడియన్స్‌ను ఆకట్టుకున్నారు. గేమ్ మధ్యలో సుమ ఓ టాస్క్ పెట్టింది. ‘పెళ్లి చేసుకోవాలని ఎప్పుడనిపిస్తుందని’ అడిగింది. దీనికి ఈషా ఫస్ట్ బజర్ నొక్కింది. ఇక సుమ మీ ప్రేమ గురించి చెప్పాలని అడిగడంతో.. నిజానికి నాకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారంటూ ఒక్కసారిగా బాంబ్ పేల్చింది. మరీ నాన్న ఎక్కడున్నాడంటూ యాంకర్ ప్రశ్నించింది. ప్రస్తుతం ఈ ప్రోమో యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. మరీ ఈ డస్కీ బ్యూటీ ఏం సమాధానం చెప్తుందో ఈ నెల(జులై)22వ తేదీ వరకు ఎదురుచూడాల్సిందే
ఇవి కూడా చదవండి: Prabhas రేంజ్ అంటే ఇది..!