జాతి కోసం తెలంగాణ ప్రభుత్వంపై పోరాటం.. ఈసం నారాయణ పిలుపు

దిశ, కొత్తగూడ: జల్ జంగిల్ జమీన్ అను నినాదంతో నైజాం రజాకార్లకు ఎదురునిలిచి జాతి కోసం పోరాడి అసువులు బాసిన అమర వీరుడు.. ఆదివాసి ముద్దు బిడ్డ కొమురం భీం వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించకపోవటం దారుణం అని కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఈసం నారాయణ అన్నారు. ఈ నేపథ్యంలోనే కొత్తగూడ మండల కేంద్రంలో ఆదివాసి ఉద్యోగుల సంక్షేమ, సాంస్కృతిక సేవా సంఘం, తుడుం దెబ్బ ఆధ్వర్యంలో కొమురం భీం 81వ వర్ధంతిని పురస్కరించుకుని భారీ ర్యాలీ […]

Update: 2021-10-24 07:48 GMT

దిశ, కొత్తగూడ: జల్ జంగిల్ జమీన్ అను నినాదంతో నైజాం రజాకార్లకు ఎదురునిలిచి జాతి కోసం పోరాడి అసువులు బాసిన అమర వీరుడు.. ఆదివాసి ముద్దు బిడ్డ కొమురం భీం వర్ధంతిని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించకపోవటం దారుణం అని కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఈసం నారాయణ అన్నారు. ఈ నేపథ్యంలోనే కొత్తగూడ మండల కేంద్రంలో ఆదివాసి ఉద్యోగుల సంక్షేమ, సాంస్కృతిక సేవా సంఘం, తుడుం దెబ్బ ఆధ్వర్యంలో కొమురం భీం 81వ వర్ధంతిని పురస్కరించుకుని భారీ ర్యాలీ నిర్వహించారు. గాంధీనగర్ నుంచి మొదలైన ర్యాలీ కొత్తగూడ మండల కేంద్రంలోని ప్రధాన వీధులలో డప్పు చప్పుళ్లతో ఊరేగింపుగా బయలుదేరి విగ్రహ ప్రాంగణానికి చేరుకుంది. అనంతరం పూలమాలలతో కొమురం భీంకు నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ప్రొఫెసర్ ఈసం నారాయణ మాట్లాడుతూ.. ఆనాడు మన ఆదివాసీ బిడ్డ కొమురం భీమ్ జాతికోసం పోరాడి వీర మరణం పొందారని గుర్తు చేశారు. ఇప్పుడు మన జాతికి-రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పోడు పోరాటం జరుగుతుందన్నారు. మన జాతి ఏండ్ల తరబడి చెట్టును-పుట్టను నమ్ముకుని కుటుంబాలను పోషించుకుంటున్నాయని.. ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం హరితహారం లాంటి ప్రత్యేక చట్టాలను తీసుకొచ్చిందన్నారు. దీంతో పోడు భూములను లాక్కొని మన జాతిని ఏజెన్సీ ప్రాంతాల నుంచి తరిమికొట్టే కుట్ర పన్నుతున్నదని ఆరోపించారు. ఈ ప్రభుత్వ ఎత్తుగడలను తిప్పిగొట్టటానికి ప్రతి ఒక్క ఆదివాసీ గిరిజన బిడ్డ కొమురం భీం తరహాలో పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో తొమ్మిది తెగల సమన్వయ కర్త చుంచ రామకృష్ణ, తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షులు ఉపేందర్, తుడుందెబ్బ జాతీయ కన్వీనర్ రామనాల లక్ష్మయ్య, సంక్షేమ పరిషత్ జాతీయ అధ్యక్షులు దాట్ల నాగేశ్వరరావు, ములుగు నియోజకవర్గ యువ నాయకుడు దనుసరి సూర్య, ఏఈడబ్ల్యూసీ దనుసరి అంజయ్య, వట్టం సాయిలు, స్థానిక సర్పంచ్ మల్లెల రణధీర్, సువర్ణపాక సమ్మయ్య, సుభాష్, శివ క్రిష్ణ, శ్రీరాములు, వాసం వీరస్వామి, కొమ్మాలు, శ్రీను, ఏఎన్ఎస్ సభ్యులు పాల్గొన్నారు.

Tags:    

Similar News