‘దిశ’ కథనానికి స్పందన.. రంగంలోకి ఈఈ.. నోటీసులు జారీ

దిశ, కూకట్​పల్లి : ‘‘పెచ్చులూడుతున్న డబుల్ ఇండ్లు’’ అన్న శీర్షికన శనివారం ‘దిశ’ పత్రికలో ప్రచురితమైన కథనానికి స్పందించిన జీహెచ్ఎంసీ హౌజింగ్ అధికారులు డబుల్ బెడ్ రూం ఇండ్లను పరిశీలించారు. ఈఈ రవీందర్ ఆదేశాల మేరకు డీఈ హరగోపాల్, ఏఈ దుర్గాప్రసాద్‌లు డబుల్​బెడ్ రూం ఇండ్ల వద్దకు వెళ్లి డ్రైనేజీ లీకేజీలు, ఫ్లోరింగ్, కారుతున్న నీటి ట్యాంక్ తదితర సమస్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా ‘దిశ’తో ఈఈ రవీందర్ మాట్లాడుతూ డబుల్ బెడ్​రూం ఇండ్లలో ఉన్న సమస్యలను […]

Update: 2021-09-25 05:36 GMT

దిశ, కూకట్​పల్లి : ‘‘పెచ్చులూడుతున్న డబుల్ ఇండ్లు’’ అన్న శీర్షికన శనివారం ‘దిశ’ పత్రికలో ప్రచురితమైన కథనానికి స్పందించిన జీహెచ్ఎంసీ హౌజింగ్ అధికారులు డబుల్ బెడ్ రూం ఇండ్లను పరిశీలించారు. ఈఈ రవీందర్ ఆదేశాల మేరకు డీఈ హరగోపాల్, ఏఈ దుర్గాప్రసాద్‌లు డబుల్​బెడ్ రూం ఇండ్ల వద్దకు వెళ్లి డ్రైనేజీ లీకేజీలు, ఫ్లోరింగ్, కారుతున్న నీటి ట్యాంక్ తదితర సమస్యలను పరిశీలించారు.

ఈ సందర్భంగా ‘దిశ’తో ఈఈ రవీందర్ మాట్లాడుతూ డబుల్ బెడ్​రూం ఇండ్లలో ఉన్న సమస్యలను పది నుంచి పదిహేను రోజుల్లో సాల్వ్ చేస్తామని అన్నారు. మరమ్మత్తులు చేయిస్తామని, ఇండ్లను నిర్మించిన సైబర్ సీటీ డెవలపర్స్ నిర్మాణ సంస్థకు నోటీసులు జారీ చేయనున్నట్టు తెలిపారు.

Tags:    

Similar News