ఎయిర్‌పోర్ట్ సిటీలో ఎడ్యుపోర్ట్
దిశ, న్యూస్‌బ్యూరో: హైదరాబాద్ ఎయిర్‌పోర్టు సిటీ(Hyderabad Airport City)లో ప్రత్యేకమైన అర్బన్ ఎకో సిస్టమ్ రానుంది. విద్య, పరిశోధన సంస్థలను ఆకర్షించేలా అంతర్జాతీయ స్థాయి ఎడ్యుకేషన్ క్లస్టర్‌ను సృష్టించడానికి సుమారు 100ఎకరాలల్లో జీఎంఆర్ హైదరాబాద్ ఎయిరొట్రొపొలిస్ లిమిటెడ్ ఎడ్యు పోర్ట్ నిర్మాణాన్ని వేగవంతం చేసింది. ‘ఎడ్యు పోర్ట్’ (‘Edu port)అనేది జాతీయ, అంతర్జాతీయ సంస్థలను కలిగి, అన్ని వయసుల విద్యార్థులకు అవసరమైన అధ్యయన కోర్సులు అందుబాటులోకి తీసుకువచ్చే ఒక నాలెడ్జ్ హబ్(Knowledge Hub)గా తీర్చిదిద్దుతున్నారు. ఒక లెర్నింగ్, […]
దిశ, న్యూస్‌బ్యూరో: హైదరాబాద్ ఎయిర్‌పోర్టు సిటీ(Hyderabad Airport City)లో ప్రత్యేకమైన అర్బన్ ఎకో సిస్టమ్ రానుంది. విద్య, పరిశోధన సంస్థలను ఆకర్షించేలా అంతర్జాతీయ స్థాయి ఎడ్యుకేషన్ క్లస్టర్‌ను సృష్టించడానికి సుమారు 100ఎకరాలల్లో జీఎంఆర్ హైదరాబాద్ ఎయిరొట్రొపొలిస్ లిమిటెడ్ ఎడ్యు పోర్ట్ నిర్మాణాన్ని వేగవంతం చేసింది. ‘ఎడ్యు పోర్ట్’ (‘Edu port)అనేది జాతీయ, అంతర్జాతీయ సంస్థలను కలిగి, అన్ని వయసుల విద్యార్థులకు అవసరమైన అధ్యయన కోర్సులు అందుబాటులోకి తీసుకువచ్చే ఒక నాలెడ్జ్ హబ్(Knowledge Hub)గా తీర్చిదిద్దుతున్నారు. ఒక లెర్నింగ్, ట్రైనింగ్, రీసెర్చ్, ఇన్నోవేషన్ సెంటర్(Innovation Center)గా హైదరాబాద్ ఎయిర్ పోర్టు సిటీలోని ఎడ్యుపోర్ట్‌లో బిజినెస్ స్కూల్, ఇంటర్నేషనల్ స్కూల్, ఏవియేషన్ అకాడమీ (Aviation Academy),ఎయిరోస్పేస్ ఇంజనీరింగ్, ఫ్లైట్ ట్రైనింగ్, సిమ్యులేటర్ ట్రైనింగ్, ఇంజిన్ మెయింటెనెన్స్ ఉంటాయి. ఈ ఎడ్యుకేషన్ క్లస్టర్‌లో చిన్మయ విద్యాలయ, షూలిచ్ స్కూల్ ఆఫ్ బిజినెస్, జీఎంఆర్ ఏవియేషన్ అకాడమి, ఫ్లైట్ సిమ్యులేషన్ టెక్నిక్ సెంటర్, సౌత్ ఏషియా ట్రైనింగ్ సెంటర్(South Asia Training Center), ప్రాట్ అండ్ విట్నీ ఇండియా ట్రైనింగ్ సెంటర్‌లు కూడా రానున్నాయి.
ఎడ్యు పోర్టు విజన్‌కు ఊతమిస్తూ హైదరాబాద్ ఎయిరొట్రొపొలిస్ లిమిటెడ్ ఇటీవలే రెసిడెన్షియల్ అకాడమిక్ ఫెసిలిటీ(Residential Academic Facility), ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణం కోసం హైదరాబాద్ కేంద్రంగా గల సెయింట్ మేరీస్ ఎడ్యుకేషన్ సొసైటీ(St. Mary’s Education Society)తో ఒప్పందంపై సంతకాలు చేసింది. ఈ ఒప్పందం ప్రకారం ఇంటర్నేషనల్ స్కూల్ వారి కిండర్ గార్టెన్ నుంచి 12వ తరగతి వరకు వెంచర్ కొరకు ఎయిర్ పోర్టు సిటీలో 15ఎకరాల సర్వీస్డ్ స్థలాన్ని అందజేస్తారు. ఇది 2022 లో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. జీఎంఆర్ ఎయిర్‌పోర్టు(GMR Airport) బిజినెస్ చైర్మన్ జీబీఎస్ రాజు మాట్లాడుతూ.. ఎయిర్ పోర్ట్ సిటీలో ఒక విద్యాసంస్థను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. దేశాన్ని ఒక గ్లోబల్ నాలెడ్జ్ (Global Knowledge) సూపర్ పవర్‌గా రూపొందించడం కోసం అవసరమైన అధ్యయన పర్యావరణాన్ని సృష్టించడానికి మేం కృషి చేస్తున్నామన్నారు.