తెలంగాణలో విద్యాసంస్థలు ప్రారంభం.. డేట్‌ఫిక్స్

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో సెప్టెంబర్ 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం కానున్నాయి. విద్యా సంస్థలు తెరవచ్చని వైద్య ఆరోగ్య శాఖ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో.. సెప్టెంబర్ 1 నుంచి ప్రత్యక్ష క్లాసులు ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇదే విషయంపై సీఎం కేసీఆర్‌తో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్, సీఎస్ సోమేశ్ కుమార్ సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ 1 నుంచి ప్రత్యక్ష తరగతులను ప్రారంభించేందుకు తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. కాగా, 1వ […]

Update: 2021-08-23 07:52 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో సెప్టెంబర్ 1 నుంచి విద్యాసంస్థలు ప్రారంభం కానున్నాయి. విద్యా సంస్థలు తెరవచ్చని వైద్య ఆరోగ్య శాఖ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో.. సెప్టెంబర్ 1 నుంచి ప్రత్యక్ష క్లాసులు ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇదే విషయంపై సీఎం కేసీఆర్‌తో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్, సీఎస్ సోమేశ్ కుమార్ సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ 1 నుంచి ప్రత్యక్ష తరగతులను ప్రారంభించేందుకు తెలంగాణ సర్కార్ నిర్ణయం తీసుకుంది. కాగా, 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఆన్‌లైన్ క్లాసులను నిర్వహించనుండగా.. 8 నుంచి పీజీ వరకు ఆఫ్‌లైన్ క్లాసుల నిర్వహణకు సీఎం కేసీఆర్‌ విద్యాశాఖకు ఆదేశాలు ఇచ్చారు.

Tags:    

Similar News