NHLML: నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్ లో గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI) కు చెందిన నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్(NHLML) వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

Update: 2024-10-18 16:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా(NHAI) కు చెందిన నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్‌మెంట్ లిమిటెడ్(NHLML) వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా 28 గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రెయినీ(Graduate Engineer Trainee) పోస్టులను భర్తీ చేయనున్నారు. అన్ రిజర్వుడ్ వాళ్లకు 16, ఓబీసీలకు 6, ఎస్సీలకు 3, ఎస్టీలకు 1, ఈడబ్ల్యూఎస్‌లకు 2 పోస్టుల చొప్పున కేటయించారు. ఆసక్తి గల అభ్యర్థులు www.nhlml.org.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ నవంబర్ 11, 2024. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులను కాంట్రాక్టు ప్రాతిపదికన ఐదేళ్ల కాలానికి ఉద్యోగంలోకి తీసుకుంటారు.

పోస్టుల వివరాలు:

  • గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రెయినీ(Civil)
  • గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రెయినీ(Electronics And Communication)
  • గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రెయినీ(Mechanical)

విద్యార్హత:

అభ్యర్థులు సివిల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, మెకానికల్ ఇంజినీరింగ్ లో బీఈ/ బీటెక్ 65 శాతం మార్కులతో పూర్తి చేసి ఉండాలి. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 55 శాతం సరిపోతుంది. అలాగే గేట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయోపరిమితి:

ఈ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థుల వయస్సు అక్టోబర్ 1, 2024 నాటికి 30 ఏళ్లకు మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, దివ్యాంగులకు పది నుంచి పదిహేనేళ్ల వరకు సడలింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ:

గేట్ స్కోర్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. గేట్ మార్కులకు 90 శాతం, ఇంటర్వ్యూకు 10 శాతం వెయిటేజిని కేటాయించారు.

జీతం:

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 40,000 నుంచి రూ.1,40,000 వరకు జీతం ఉంటుంది.


Similar News