నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జర్మనీలో నర్సింగ్ ఉద్యోగాలకు శిక్షణ.. ఎప్పటి నుంచంటే?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో సీడాప్-డిడియుజికెవై స్కిల్ ట్రైనింగ్ సెంటర్ ద్వారా నర్సింగ్ అభ్యర్థులకు సువర్ణావకాశం.

Update: 2025-03-19 13:00 GMT
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. జర్మనీలో నర్సింగ్ ఉద్యోగాలకు శిక్షణ.. ఎప్పటి నుంచంటే?
  • whatsapp icon

దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ట్రైనింగ్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో సీడాప్-డిడియుజికెవై స్కిల్ ట్రైనింగ్ సెంటర్ ద్వారా నర్సింగ్ అభ్యర్థులకు సువర్ణావకాశం. జర్మనీలో నర్సింగ్ ఉద్యోగాలు(Nurse jobs) కల్పించేందుకు ప్రత్యేకంగా జర్మన్ భాష శిక్షణ తరగతులు త్వరలో ప్రారంభం కానున్నాయి. 6 నుంచి 9 నెలల పాటు ఉచిత శిక్షణ మరియు ఉచిత భోజన వసతి కల్పిస్తారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్న అభ్యర్థులు జర్మనీలో ఉద్యోగం పొందవచ్చు.

వివరాల్లోకి వెళితే.. జర్మనీ(Germany)లో నర్స్ ఉద్యోగాల కోసం అర్హులైన వారికి శిక్షణ ఇవ్వనున్నట్లు రాష్ట్ర స్కిల్ & ట్రైనింగ్ డిపార్ట్‌మెంట్, సీడాప్ ఓ ప్రకటనలో తెలిపింది. అభ్యర్థులు BSc, MSc నర్సింగ్ చదివి ఉండాలి. 20 నుంచి 35 సంవత్సరాల వయసు, సాధారణ ఆస్పత్రుల్లో పని అనుభవం, జర్మనీ భాష నేర్చుకునేందుకు ఆసక్తి ఉండాలి . ఈ నెల(మార్చి) 24 నుంచి విజయవాడ(Vijayawada)లోని భవానీపురం సెంటర్‌లో శిక్షణ తరగతులు ప్రారంభం అవుతాయి. ఈ ఉద్యోగాలకు ఎంపికైనట్లయితే జీతం నెలకు రూ.2.4 నుంచి రూ.3 లక్షల వరకు ఉంటుంది. పూర్తి వివరాలకు ఫోన్:9963074879, 9492719843 నంబర్లను సంప్రదించండి.

Tags:    

Similar News