యోగా ఒంటికి మంచిదేగా

'తం విద్వాద్ దుఖ్ః సంయోగ్-వియోగం యోగ సంహితమ్' 'మీరు దుఃఖం నుంచి వేరుపడి విముక్తులు కావడమే యోగా' అని ఈ శ్లోకం అర్థం. యోగాను జీవితంలో ఒక భాగం చేసుకొమ్మని గీత ప్రబోధిస్తుంది.

Update: 2022-06-20 18:30 GMT

దేశవ్యాప్తంగా చారిత్రక వారసత్వం ఉన్న అత్యంత ప్రత్యేకత గల 75 ప్రదేశాలలో సంఘటిత యోగా ప్రదర్శనలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. 192 దేశాలలో యోగా కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. మొట్టమొదటిసారిగా ఆయుష్ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి అందులో యోగా డిపార్ట్‌మెంట్‌ను చేర్చడం మోడీకి ప్రజల ఆరోగ్యం, ప్రపంచ ఆరోగ్యం మీద ఉన్న శ్రద్ధకు నిదర్శనం. మోదీ నాయకత్వంలో భారతదేశం విశ్వగురువుగా అవతరించడం త్వరలోనే సాకారం అవుతుందని ఆశిద్దాం.

'తం విద్వాద్ దుఖ్ః సంయోగ్-వియోగం యోగ సంహితమ్' 'మీరు దుఃఖం నుంచి వేరుపడి విముక్తులు కావడమే యోగా' అని ఈ శ్లోకం అర్థం. యోగాను జీవితంలో ఒక భాగం చేసుకొమ్మని గీత ప్రబోధిస్తుంది. నరేంద్ర మోడీ ప్రధానిగా పదవి బాధ్యతలు స్వీకరించిన మొదటి సంవత్సరంలోనే ఐక్యరాజ్యసమితిలో జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవంగా జరపాలని ప్రతిపాదన పెట్టి ఆమోదింపజేశారు. దేశంలో అంతకు ముందు నుంచే యోగా ఉన్నా దానికి అంతర్జాతీయ గుర్తింపు ఇచ్చిన నాటి నుండి ఒక ప్రజా ఉద్యమంగా మారింది. వివిధ దేశాలలో యోగా కేంద్రాలు నెలకొల్పుతున్నారు. నేర్చుకునే ఔత్సాహికులూ పెరుగుతున్నారు. 'యోగాతో సహజ సిద్ధంగా ఆరోగ్యం చేకూరుతుంది' అనే నినాదంతో భారతదేశం ప్రపంచ ఆరోగ్య రంగానికి నాయకత్వం వహించే స్థాయికి ఎదిగింది. నాగరికత లేక నరులు ఉన్నప్పుడు వేదాలను వెలికితీసి జ్ఞాన భిక్ష పెట్టింది భారతదేశం.

యోగా భారతదేశ సునిశిత శక్తి. ప్రాచీనకాలంనాటి కళాకృతి. దీని ప్రయోజనాలు విస్తృత ప్రపంచానికి అందించేందుకే భారత్ నడుం బిగించింది. ప్రదేశం, పరిస్థితి, వయసు అనే దానితో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి యోగాతో ఒక పరిష్కారం లభిస్తుంది. 'సమత్వం యోగ ఉచ్యతే' అని రుషులు బోధించారు. 'ఆనందంలోనూ, దుఃఖంలో నూ సమానంగా వ్యవహరించాలి, సంయమనం కూడా పాటించాలి అనేదే యోగా ప్రధాన సందేశం. ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద మహమ్మారి కాలంలో కూడా యోగా ప్రతిష్ట సజీవంగా ఉంది. దేశం, ప్రపంచం యోగాను జీవితంలో అంతర్భాగం చేసుకోవాలి సున్నా (0) వ్యయంతో ఆరోగ్య బీమా కల్పించడమే యోగా శక్తికి తార్కాణం. అది ఒత్తిడి నుంచి బలం, ప్రతికూల ప్రభావం నుంచి సృజనాత్మకత చూపుతుంది. కుంగుబాటు నుంచి ఉత్సాహం పుంజుకోవడం, ఉత్సాహం నుంచి ప్రయోజనాలు అందుకోవడం అనే బాటలోకి యోగా మనలను నడిపిస్తుంది.

సూర్యుని కదలికల ఆధారంగా

ప్రపంచ యోగా దినోత్సవం 2015 నుండి నిర్వహిస్తున్నారు. ఒక్కో సంవత్సరం ఒక్కో పేరుతో యోగా దినోత్సవాన్ని నిర్వహించాలని భారతదేశం ప్రపంచానికి పిలుపునిస్తోంది. ప్రతీ సంవత్సరం యోగా డే వివిధ పేర్లతో కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ సంవత్సరం 'ఆరోగ్యానికి యోగా' పేరుతో మైసూర్‌లో భారీ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. ఈ ఏడాది యోగా దినోత్సవ నిర్వహణ దేశవిదేశాలలో మరింత వినూత్నంగా సాగుతుంది. అందులో ఒక గార్డెన్ రింగ్ కూడా ఉంటుంది. సూర్యుని కదలికలకు అనుగుణంగా సాగే వినూత్న కార్యక్రమం ఇది. వివిధ దేశాలలోని భారత రాయబార కార్యాలయాలు స్థానిక కాలమానం ప్రకారం సూర్యోదయ సమయానికి యోగా కార్యక్రమాలు నిర్వహిస్తాయి.

తూర్పు నుంచి పడమరకు ఒక దేశం నుంచి మరో దేశంలోకి ఈ కార్యక్రమం కదులుతూ ఉంటుంది. దేశవ్యాప్తంగా చారిత్రక వారసత్వం ఉన్న అత్యంత ప్రత్యేకత గల 75 ప్రదేశాలలో సంఘటిత యోగా ప్రదర్శనలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. 192 దేశాలలో యోగా కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు. మొట్టమొదటిసారిగా ఆయుష్ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి అందులో యోగా డిపార్ట్‌మెంట్‌ను చేర్చడం మోడీకి ప్రజల ఆరోగ్యం, ప్రపంచ ఆరోగ్యం మీద ఉన్న శ్రద్ధకు నిదర్శనం. మోదీ నాయకత్వంలో భారతదేశం విశ్వగురువుగా అవతరించడం త్వరలోనే సాకారం అవుతుందని ఆశిద్దాం.

(నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం)

 కూరపాటి విజయ్‌కుమార్

బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి

మేడ్చల్, 99498 88585

Tags:    

Similar News