మహా పోటీలో బీఆర్ఎస్ గట్టెక్కేనా?
Will BRS survive in the maharastra competition?
ప్రస్తుతం దేశంలోనే రైతుల ఆత్మహత్యలు అధికంగా ఉండే రాష్ట్రం మహారాష్ట్ర. ఆ రాష్ట్రంలో గోదావరి, మంజీర నదులు ఉన్నా, ఆ వనరులను రైతాంగానికి అందించడంలో పాలకుల నిర్లక్ష్యం తీవ్రంగా కనిపిస్తుంది. దీంతో దశాబ్దాలుగా మహారాష్ట్రలోని ప్రజల బతుకులు మారడం లేదు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా రైతు సంక్షేమమే ఏకైక ఎజెండాగా రూపొందిస్తున్న కేసీఆర్... బీఆర్ఎస్ పార్టీని ఇతర రాష్ట్రాల్లో విస్తరిస్తున్నారు. మొదటగా కిసాన్ సెల్ ప్రతినిధులను ప్రతి రాష్ట్రానికి నియమిస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే మహారాష్ట్రకు సైతం నియమించారు. దీంతో అక్కడ రైతులు ప్రముఖులు బీఆర్ఎస్‌లో చేరడానికి ఉత్సాహపడుతున్నారు. పైగా మహారాష్ట్రంలోని కొంత ప్రాంతం పాత హైదరాబాద్ సంస్ధానంలోని ప్రాంతాలు కావడం, మరోవైపు ఎక్కువగా తెలుగువారు ఉపాధి నిమిత్తం ముంబాయి వెళ్ళి ఎందరో అక్కడే స్థిరపడిపోయారు. ఇవన్నీ బీఆర్ఎస్‌కి కలిసిరావొచ్చు.
ప్రత్యామ్నాయ పార్టీ కోసం..
సహజ వనరులు ఉన్నా మహారాష్ట్రలోని ప్రజల, రైతుల బతుకులు బాగుపడలేకపోయాయి. దీంతో మహారాష్ట్ర వాసులకు బీఆర్ఎస్ ఆశా కిరణంలా కనిపిస్తోంది. అందుకే బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అక్కడ స్పష్టమైన లక్ష్యాలతో ప్రజల్లోకి వెళ్లేందుకు, ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే ఇటీవల మహారాష్ట్రకు ఇన్చార్జిలను సైతం నియమించింది. పైగా తెలంగాణ లాంటి సంక్షేమ పథకాలు, జీవితాలు తమకు కావాలంటే.. తమ బతుకుల్లోని చీకట్లు తొలగాలంటే.. బీఆర్ఎస్‌ని వెలుగుగా భావిస్తున్నారు. గత దశాబ్ధాలుగా వివిధ పార్టీలు అధికారంలోకి వచ్చి పరిపాలిస్తున్నప్పటికీ.. మహారాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాల్లో అంతగా వచ్చిన మార్పు ఏమీ లేకపోవడంతో అక్కడి ప్రజలు ప్రత్యామ్నాయ పార్టీ వైపు చూస్తున్నారు.
ఇక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సైతం మహారాష్ట్రపై ప్రత్యేక దృష్టి సారించారు. అందుకే బీఆర్ఎస్ పార్టీ ఏర్పడ్డాక మొదటిసారి అక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయాన్ని చూస్తుంటే .. తెలంగాణ రాష్ట్ర సాధన క్రమంలో ఇక్కడ స్థానిక సంస్థల్లో పోటీ చేసి గెలిచి సత్తా చాటి దేశానికి ఓ సందేశాన్ని ఇవ్వడానికి సిద్దమైంది. అబ్ కీ బార్ కిసాన్ సర్కారుతో కేసీఆర్ కదిలితే.. బీజేపీ మాత్రం సంపన్నులతో దోస్తీ చేస్తుంది. ఏది ఏమైనా కేసీఆర్ దేశం కోసం తీసుకుంటున్న నిర్ణయాలపై మెజారిటీ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వడివడిగా విస్తరిస్తున్న భారత రాష్ట్ర సమితికి.. మహారాష్ట్ర మణిహారంగా నిలవనుంది. పైగా ఆదిలాబాద్‌కు ఆనుకొని ఉన్న మహారాష్ట్రకు చెందిన అనేక పల్లెలు... తమ గ్రామాలను తెలంగాణలో కలపాలనే డిమాండ్ తెరమీదకు తీసుకొచ్చాయంటే అక్కడి ప్రజలకు బీఆర్ఎస్ నాయకత్వంపై ఎంత నమ్మకం ఉందో గమనించవచ్చు. పైగా అక్కడ జరిగిన రెండు సభలకు అక్కడి ప్రాంత వాసులనుంచి విశేష స్పందన లభించడంతో బీఆర్ఎస్ ఓటర్ల పట్ల విశ్వాసం వ్యక్తం చేస్తుంది.
సంపత్ గడ్డం
7893303516