Group-1: ఫలితాలు ఎందుకు ఆలస్యమవుతున్నాయి?
Group-1: ఫలితాలు ఎందుకు ఆలస్యమవుతున్నాయి?... why group-1 results releasing late
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించి దాదాపు రెండు నెలలు గడిచింది. అయినా మెయిన్స్ లిస్ట్ ఇంకా ప్రకటించకపోవడం టీఎస్ పీఎస్‌సీ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. పరీక్ష రాసిన దాదాపు మూడు లక్షల మంది అభ్యర్థులు ఫలితాల ఆలస్యంతో అయోమయానికి గురవుతున్నారు. తాజాగా గ్రూప్ -4(group-4), జేఎల్ నోటిఫికేషన్‌లు(JL notification) కూడా రావడంతో దేనికి ప్రిపేర్ కావాలో అర్థం కాక వారంతా ఆందోళన చెందుతున్నారు. గత పదేళ్లుగా ఎదురుచూసిన నిరుద్యోగులకు ఒక పక్క వరుసగా నోటిఫికేషన్‌లు రావడం, మరోపక్క కోర్టు కేసులతో ఫలితాలు ఆగడంతో తీవ్ర గందరగోళానికి గురవుతున్నారు.
గ్రూప్-1 ఫలితాలపై దాదాపు 20 కేసులు హైకోర్టులో పెండింగులో ఉన్నాయి. వాటికి కౌంటర్ దాఖలు చేయాల్సిన టీఎస్ పీఎస్‌సీ(tspsc) నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తోంది. ముఖ్యంగా తెలంగాణ హైకోర్టులో స్టే ఉన్న హారిజంటల్ రిజర్వేషన్‌లపై మాత్రమే టీఎస్ పీఎస్‌సీ మొండి పట్టుదలతో ఉంది. హారిజంటల్ రిజర్వేషన్‌లను సుప్రీంకోర్టు సైతం సమర్థించిందన్న విషయాన్ని టీఎస్ పీఎస్‌సీ మరిచిపోయింది. రాష్ట్ర సర్కారు సైతం కొత్తగా ఎస్టీ రిజర్వేషన్ ప్రకటించి గ్రూప్-1 ఫలితాల ప్రకటనకు మోకాలడ్డుతున్నట్టుగా అనిపిస్తోంది. ఇప్పటికైనా టీఎస్ పీఎస్‌సీ గోవా యూపీఎస్‌సీ తీర్మానాన్ని స్ఫూర్తిగా తీసుకుని, గ్రూప్-1 మెరిట్ లిస్ట్‌ని వెంటనే ప్రకటించాలి. లేదంటే నిరుద్యోగులను ఉద్దేశ్యపూర్వకంగా వంచించడానికి ప్రభుత్వ కనుసన్నలలోనే టీఎస్ పీఎస్‌సీ పని చేస్తున్నట్టు భావించాల్సి ఉంటుంది.
పసునూరి శ్రీనివాస్
మెట్‌పల్లి, జగిత్యాల జిల్లా
88018 00222
పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ dishaopinion@gmail.com, వాట్సప్ నెంబర్ 7995866672.
Also Read....