గత ప్రభుత్వంలో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్‌తో సంబంధం లేని వారు, ఆఫీసుల్లో కూర్చున్న క్లర్కులు జిల్లా విద్యాశాఖ అధికారులుగా తెలంగాణలో విధులు వెలగబెట్టడం వల్ల తెలంగాణలోని 33 జిల్లాల్లో ప్రాథమిక పాఠశాల నుంచి హైస్కూల్ వరకు విద్యావ్యవస్థ బ్రష్టు పట్టినది. టీచర్ ప్రమోషన్ విషయంలో పాస్ కావాలని నిబంధన పెట్టిన తెలంగాణ సర్కార్ ఉపాధ్యాయ శిక్షణ చేయని, ఉపాధ్యాయ శిక్షణ పొందని వారితో జిల్లా విద్యాశాఖ అధికారులుగా ఇన్చార్జి బాధ్యత ఇచ్చి తెలంగాణ సమాజాన్ని అపహాస్యం పాలు చేసింది. తెలంగాణలో 33 జిల్లాలకు గాను 12 రెగ్యులర్ డీఈఓ పోస్టులు ఉన్నాయి. అందులో 4 గురు మాత్రమే రెగ్యులర్ డీఈఓలు! 33 జిల్లాలు ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం 21 జిల్లాలకు డీఈఓ పోస్టులను మంజూరు చేయలేదు. ఇలా క్లర్కులు, విద్యపై అవగాహన లేని అసిస్టెంట్ డైరెక్టర్లతో డీఈఓగా ఇన్చార్జి బాధ్యతలు ఇచ్చి అవినీతి అక్రమాలు చేసుకోమని లైసెన్స్ ఇచ్చినట్లుగా ఉందని విద్యా అభిమానులు భావిస్తున్నారు.
ఏళ్ల తరబడి జిల్లాలో పనిచేస్తూ ప్రైవేటు పాఠశాలలకు ఫీల్డ్ విజిట్ చేయకుండానే అడ్డగోలుగా ప్రైవేటు బడులకు అనుమతులు ఇచ్చి అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న జిల్లా విద్యాశాఖ అధికారుల సంఖ్య తెలంగాణలో 20 కి పైగా ఉంది. ఒక్క భూపాలపల్లి కలెక్టర్ మాత్రమే అక్కడి డీఈవో ఆఫీసుకు తాళం వేసి హైదరాబాదుకు సరెండర్ చేసి తన ఘనతను చాటుకున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులపై ఉపాధ్యాయ సంఘాల నేతలు ఎన్నిసార్లు సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేసినప్పటికీ నాటి తెలంగాణ ప్రభుత్వం గానీ, విద్యాశాఖ డైరెక్టరేట్ కానీ ఇప్పటివరకు విచారణకు ఆదేశించకపోవడం గమనార్హం. కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలోని 33 జిల్లాల జిల్లా విద్యాశాఖ అధికారులను తక్షణమే బదిలీ చేసి గాడి తప్పిన ఉపాధ్యాయుల విద్యను కాపాడాలని ఉపాధ్యాయ సంఘాలు పేరెంట్స్, విద్యావేత్తల డిమాండ్.
రావుల రాజేశం
ప్రధాన కార్యదర్శి తెలంగాణ సామాజిక రచయితల సంఘం
77801 ౮౫౬౭౪
Read More..
రాముడిపై కాంగ్రెస్ పార్టీకి నమ్మకం లేదు: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు