బ్రహ్మోత్సవ కాంతులలో.. మెరిసే శేషశైల శిఖామణి

నానా దిక్కులెల్ల నరులెల్ల వానలలోనే వత్తురు కదిలి’ అని అన్నమయ్య వర్ణించినట్టు- తిరుమల బ్రహ్మోత్సవాలకు దేశ విదేశాల నుంచి భక్తజన ప్రభంజనం పోటెత్తుతుంది.

Update: 2024-10-04 00:00 GMT

నానా దిక్కులెల్ల నరులెల్ల వానలలోనే వత్తురు కదిలి’ అని అన్నమయ్య వర్ణించినట్టు- తిరుమల బ్రహ్మోత్సవాలకు దేశ విదేశాల నుంచి భక్తజన ప్రభంజనం పోటెత్తుతుంది. వరాహ, భవిష్యోత్తర పురాణాల్లో తిరుమల బ్రహ్మోత్సవాల ప్రశస్తి కనిపిస్తుంది. స్వామివారి బ్రహ్మోత్సవాలంటే .. తాళ్లపాకవారింట్లో మహాసందడి. అన్నమయ్య సాక్షాత్తూ ఆదిలక్ష్మి తండ్రి అవుతాడు. బ్రహ్మాండనాయకుడికి బాసికం కడతాడు. కమనీయమూర్తికి కన్యాదానం చేస్తాడు. గంగాజనకుడి కాళ్లు కడుగుతాడు. ఆ తొమ్మిదిరోజుల వైభోగాన్నీ ఓ కీర్తనలో అద్భుతంగా వర్ణించాడు. శ్రీవారికి తొలిసారిగా బ్రహ్మదేవుడు ఈ ఉత్సవాన్ని జరిపించడం వల్ల ఇవి బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధి కెక్కాయి. నవాహ్నిక దీక్షతో నవ బ్రహ్మలు తొమ్మిది రోజులు జరిపే ఈ ఉత్సవ పరంపర బ్రహ్మోత్సవాలయ్యాయని అంటారు.

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిగా భక్తులు ఆరాధించే దైవం తిరుమల శ్రీనివాసుడు. స్థల ప్రభావం, శిలా వైభవం కలగలసిన తిరుమల దివ్య క్షేత్రాన్ని భూలోక వైకుంఠంగా భావిస్తారు. శ్రీ వేంకటేశ్వరుని జగన్మోహనత్వం, జగదీశ్వర తత్వం యుగయుగాలుగా పరిఢవిల్లుతోంది. నిత్యకల్యాణం పచ్చ తోరణంగా విలసిల్లే తిరుమల శ్రీవారి సన్నిధి బ్రహ్మోత్సవ శోభతో అలరారనుంది. కోనేటిరాయుడు బ్రహ్మోత్సవ సంరంభంతో కొలువు దీరతాడు. కన్నుల వేడుకగా, అంగరంగ వైభవంగా సాగే ఈ మహోత్సవాలు అంకురార్పణతో ఆరంభమై చక్రస్నానంతో ముగుస్తాయి.

బ్రహ్మ జరిపించాడు కాబట్టే...

'తిరువీధుల మెరసీ దేవదేవుడు, గరిమల మించిన సింగారముల తోడను ..తిరుదండెల పైనేగీ దేవుడిదే తొలినాడు... సిరుల రెండవనాడు శేషుని మీద, మురిపేన మూడోనాడు ముత్యాల పందిరిక్రింద, పొరి నాలుగోనాడు పువ్వు కోవిలలోను, గక్కన నయిదవనాడు గరుడుని మీదను, ఎక్కెను ఆరవనాడు యేనుగు మీద, చొక్కమై ఏడవనాడు సూర్యప్రభలోనను, యిక్కువ తేరును గుర్ర మెనిమిదోనాడు, కనకపుటందలము కదిసి తొమ్మిదోనాడు, పెనచి పదోనాడు పెండ్లి పీట ఎనసి .. శ్రీవేంకటేశుడింతి అలమేల్మంగతో వనితల నడుమను వాహనాల మీదను!' అంటూ శ్రీవారికి తొలిసారిగా బ్రహ్మదేవుడు ఈ ఉత్సవాన్ని జరిపించడం వల్ల ఇవి బ్రహ్మోత్సవాలుగా ప్రసిద్ధి కెక్కాయి. నవాహ్నిక దీక్షతో నవ బ్రహ్మలు తొమ్మిది రోజులు జరిపే ఈ ఉత్సవ పరంపర బ్రహ్మోత్సవాలయ్యాయని అంటారు.

కొలువు దీరే కోనేటి రాయుడు

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిగా భక్తులు ఆరాధించే దైవం తిరుమల శ్రీనివాసుడు. స్థల ప్రభావం, శిలా వైభవం కలగలసిన తిరుమల దివ్య క్షేత్రాన్ని భూలోక వైకుంఠంగా భావిస్తారు. శ్రీ వేంకటేశ్వరుని జగన్మోహనత్వం, జగదీశ్వర తత్వం యుగయుగాలుగా పరిఢవిల్లుతోంది. నిత్యకల్యాణం పచ్చ తోరణంగా విలసిల్లే తిరుమల శ్రీవారి సన్నిధి బ్రహ్మోత్సవ శోభతో అలరారనుంది. కోనేటిరాయుడు బ్రహ్మోత్సవ సంరంభంతో కొలువు దీరతాడు. కన్నుల వేడుకగా, అంగరంగ వైభవంగా సాగే ఈ మహోత్సవాలు అంకురార్పణతో ఆరంభమై చక్రస్నానంతో ముగుస్తాయి. శ్రీవారి బ్రహ్మోత్సవ సంరంభంలో వాహన సేవలదే విశేష ప్రాముఖ్యం. తొమ్మిది రోజుల పాటు ఇరు దేవేరులతో శ్రీనివాసుడు వివిధ వాహనాలపై తిరుమాడ వీధుల్లో విహరిస్తాడు. దివ్యాలంకృతంగా, నవ్యమోహనంగా భక్తులకు శ్రీవారు భవ్యానందాన్ని అనుగ్రహిస్తాడు. బ్రహ్మోత్సవాల వేళ జరిగే ఊరేగింపులో దేవదేవునికి భక్తజనం బ్రహ్మరథం పడుతున్నారా అన్నంతగా కిటకిటలాడతారు. ఏ ఆలయంలోనూ లేని విధంగా ఇక్కడ అష్టదిక్పాలకులను, అంటే- అగ్ని, ఇంద్ర, యమ, నైరుతి, వరుణ, వాయు, కుబేర, ఈశానులను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు.

స్వామి ఊరేగింపు అద్భుతాహ

ముందుగా బ్రహ్మరథం, ఆ వెనుక వేదాలను, ద్రవిడ ప్రబంధాలను గళం నిండా నింపుకొన్న జీయరు స్వాములు, ఆ వెనుక అర్చకులు, ఆ వెనుక విష్వక్సేన- సుదర్శన- అనంత- గరుడులు, ఆ వెనుక జంత్రగాత్ర మంగళవాద్యకారులు, వేదాలను పఠిస్తూ వైదికులు, ఏనుగులూ, గుర్రాలూ, విలువైన వస్త్రాలను నడుంపై వేసుకున్న ఎద్దులూ, ఆ వెనుక దేవాలయంలో స్వామి ఊరేగింపులో పాల్గొనేందుకు నియమించిన ప్రత్యేక జనం, ఆవెనుక చక్కటి వస్త్రధారణతో పురందరదాసు కీర్తనలను ఆలపిస్తూ భక్తులు, ఆ వెనుక నృసింహ, Uశ్రీరామ, కృష్ణావతారాల్లో శ్రీహరి అవతార, మహత్యాలను, విశేషాలను వివరించే నర్తకీమణులు, ఆ వెనుక తాళాలు, భజనలు, సుద్దులు, జోలలు, తరువోజ పద్యాలు, దండకాలు చదువుతూ భక్తజనం, ఆ వెనుక పుష్పమయమైన ఆనాటి స్వామి రూపంలోని ఒక విగ్రహం, ఆ వెనుక అలంకరించుకున్న బోయీల భుజస్కందాల మీద మలయప్ప స్వామి (ఉత్సవమూర్తి అయిన వేంకటేశ్వరుడు) శ్రీదేవి, భూదేవిలతో వస్తాడు.

వైభవానికి మారుపేరు బ్రహ్మోత్సవాలు

ఒక్కమాటలో చెప్పాలంటే వైభవం అనే మాటకు అర్థం కళ్లకు కట్టాలంటే తిరుమల బ్రహ్మోత్సవాలను తిలకించాల్సిందే! ఈ బ్రహ్మోత్సవాల్లో, ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం భక్తులు వాహన సేవలను తిలకించవచ్చు. వాహన సేవలు భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తాయి. పలు వాహన సేవలలో గరుడ వాహనం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది,ఈ బ్రహ్మోత్సవాలు తిరుమల శ్రీవారి భక్తులకు విశేష అనుభూతిని కలిగించే పరమ పవిత్రమైన సమయంలో నిర్వహించబడతాయి. నవరాత్రుల సమయంలో తిరుమల దేవస్థానం ఆధ్యాత్మికంగా పండుగ వాతావరణంలో తేలిపోతుంది.

• మొదటి రోజున: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొలిరోజు సాయంత్రం ధ్వజారోహణం కార్యక్రమం నిర్వహిస్తారు. అనంతరం స్వామి వారిని ఏడు తలలున్న పెద్దశేషవాహనంపై ఊరేగిస్తారు.

• రెండో రోజున: ఉదయం ఐదు తలలున్న చిన్నశేషవాహనంపై స్వామి వారిని ఊరేగిస్తారు, అదే రోజు రాత్రి స్వామివారు హంస వాహనంపై విహరిస్తారు. మద్యాహ్నం స్నపన తిరుమంజనం జరుగుతుంది.

• మూడో రోజున: ఉదయం సింహవాహన సేవ మరియు రాత్రి ముత్యాపుపందిరి వాహనంపై ఊరేగింపు కనులవిందుగా సాగుతుంది.

• నాలుగో రోజున: ఉదయం కల్పవృక్ష వాహనం మరియు రాత్రి సర్వభూపాల వాహనంపై స్వామి వారిని ఊరేగిస్తారు.

• ఐదో రోజున: ఉదయం స్వామి వారిని మోహినీఅవతారంలో పల్లకిపై ఊరేగిస్తారు. రాత్రి స్వామి వారికీ ఇష్టమైన వాహనం అయిన గరుడవాహనం.

• ఆరో రోజున: ఉదయం హనుమంతవాహనం, సాయంత్రం వసంతోత్సవం, సువర్ణరథరంగ డోలోత్సవం మరియు రాత్రి గజవాహనంపై స్వామి వారిని ఊరేగిస్తారు.

• ఏడో రోజున: ఉదయం సూర్యప్రభ వాహనం అదే రోజు రాత్రి చంద్రప్రభ వాహనంపై స్వామి వారిని ఊరేగిస్తారు.

• ఎనిమిదో రోజున: ఉదయం రథోత్సవం మరియు రాత్రి అశ్వవాహనంపై స్వామి వారిని ఊరేగిస్తారు.

• తొమ్మిదో రోజున: ఆఖరి రోజు ఉదయం చక్రస్నాన వేడుకలతో బ్రహ్మోత్సవాల వేడుకలను ఘనంగా ముగిస్తారు. రాత్రి ధ్వజావరోహణం జరుగుతుంది.))

బ్రహ్మాదిలోకాలకిది చివరి కొండ

కట్టెదుటట్టెదుట కనిపించే వైకుంఠమే ఈ వేంకటాచలం. వేదాలే శిలలై వెలుగుతున్నాయి ఇక్కడ. బ్రహ్మాదిలోకాలకు చివరిది ఈ కొండ. శ్రీదేవుడుండేది శేషాద్రి ఈ కొండ. సకలదేవతలు మృగజాతులై సంచరిస్తారిక్కడ! సముద్రాలే సానువులయింది - లక్ష్మి కాంతుని సుఖాలకు నిలయం - ఈ కొండ. సంపదలు పుష్కలముగా ఉండే ఈ కొండ. పై కలియుగ దైవమై కటి వరద హస్తాలతో భక్తులకు కొంగుపసిడిగా భాసిల్లే కోనేటి రాయుడు కొండలంత వరాన్ని ఇవ్వాలి.. నిత్యకల్యాణం పచ్చతోరణంలా భాసిల్లు అనండ నిలయ దేదీప్యకాంతులు లోకానికి శాంతిని ప్రసాదించాలి. సనాతన ధర్మాన్ని హైందవ సంస్కృతిని ఆచార వ్యవహారాలని స్వామి వారికి జరిపించే సేవలని ఉత్సవాలని సమర్పించే కైకర్యాలని పవిత్రమైన స్వచ్చమైన సాంప్రదాయ పద్దతిని వైఖానస ఆగమ శాస్త్ర బద్దంగా జరపవలసిందే. దీనిలో రాజీ పడటానికి ఏమాత్రం తావుని ఇవ్వరాదు. ప్రభుత్వం తిరుమల తిరుపతి పాలకమండలి వివిధ మఠాధిపతులు పండితుల సలహామేరకు వాటిని తూచా తప్పకుండా అమలు జరపి భక్తుల మనోభావాలను పరిరక్షించాలి. సర్వేజనాసుఖినోభవంతు. (నేటి నుంచి తిరుమల బ్రహ్మోత్సవాలు ప్రారంభం)

వాడవల్లి శ్రీధర్

99898 55445


Similar News