ఇది ప్రభుత్వ బాధ్యతారాహిత్యమే
తెలంగాణలో ప్రభుత్వ బాధ్యతారాహిత్యం రోజురోజుకూ ఎక్కువవుతోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో చూసాం. భారీ వర్ష
ది మైన్స్ రెస్క్యూ రూల్స్ 1985' ప్రకారం సేప్టీవారిని వరదలో ఈదడానికి పంపకూడదు. ఇప్పటికే సింగరేణి బొగ్గు ప్రమాదాల వలన కార్మిక కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇక స్వరాష్ట్రంలో సింగరేణి అధికారుల వైయుక్తిక విధానాల వలన, రాష్ట్ర ప్రభుత్వ అధికార జోక్యం వలన వరదలలో కూడా ప్రాణాలు కోల్పోయే దుస్థితి వచ్చింది. వరదలో చిక్కుకున్నవారి కోసం 'నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డీఆర్ఎఫ్), స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్‌డీఆర్‌ఎఫ్) బృందాలను, సుశిక్షిత రెస్క్యూ బృందాలను వినియోగించుకోవాలి. వారికి లైఫ్ జాకెట్, వాటర్ హెల్మెట్, వాటర్ గ్లౌసెస్, వాటర్ షూ, పడవలను సమకూర్చి వరద సహాయక చర్యలు చేపట్టాలి. రక్షణ కల్పించకుండా, చట్టాలకు విరుద్ధంగా, బలవంతంగా వినియోగించుకుని సింగరేణి రెస్క్యూ ఉద్యోగుల మరణానికి కారణమయ్యారు.
తెలంగాణలో ప్రభుత్వ బాధ్యతారాహిత్యం రోజురోజుకూ ఎక్కువవుతోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో చూసాం. భారీ వర్ష సమయంలో స్పందించే డిజాస్టర్ మేనేజ్‌మెంట్ టీమ్ ఎన్‌డీఆర్ఎఫ్ సిబ్బందిని అలర్ట్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. అందుకే అంత పెద్ద యెత్తున ఆస్తి నష్టం జరిగింది. పాలనా పర తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజలను పక్కదారి పట్టించడానికి వరదల గురించి అశాస్త్రీయంగా వ్యవహరించారు. వరదలను నిలువరించడానికి ప్రత్యేక పూజలు చేయాలని పిలుపునిచ్చారు. గతంలో కరోనా సమయంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. విదేశీ శక్తులు ఆకస్మిక వరదలు(Cloud burst) సృష్టిస్తున్నారేమోనని అనుమానం అంటూ విమర్శల పాలయ్యారు.
గివెన్ అండ్ టేకన్ పాలసీ
సింగరేణిలో రాజకీయ జోక్యం ఎక్కువైంది. దీంతో కార్మిక చట్టాలు, ఒప్పందాలు బుట్ట దాఖలయ్యాయి. సింగరేణి అధికారుల, అధికార పార్టీ మధ్య గివెన్ అండ్ టేకెన్ పాలసీ వర్ధిల్లుతోంది. అవినీతి, దుబారా పెరిగింది. వందల కోట్ల అవినీతి కుంభకోణాలు వెలుగులోకి వచ్చాయి. వాటిపై విజిలెన్స్ విచారణ పూర్తి చేయడానికి కూడా జాప్యం చేస్తున్నారు. సీబీఐ విచారణ డిమాండ్‌కు స్పందించడం లేదు. సింగరేణి కార్మికులకు పని స్థలాలలో రక్షణ ఏర్పాట్లు సరిగా లేకపోవడంతో ఎన్నో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. సింగరేణి(SINGARENI) ఇచ్చిన గణాంకాల ప్రకారం 2015-19 మధ్య కాలంలో 45 మంది కార్మికులు చనిపోయారు. 1,119 మంది కార్మికులు తీవ్ర గాయాలపాలయ్యారు. కోల్ ఇండియా కన్నా సింగరేణిలోనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి. అవిభక్త ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు వైఎస్, చంద్రబాబు ఏదైనా సంఘటన జరిగితే, సందర్శించి బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపేవారు. స్వరాష్ట్రం సింగరేణిలో ప్రమాదాలు ఎక్కువగా జరిగినప్పటికీ సంఘటన స్థలాన్ని ముఖ్యమంత్రి ఏనాడూ సందర్శించలేదు. రామగుండం డివిజన్-3 లో అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టులో 2022 మార్చి 7 న సైడ్ వాల్ కూలి ఇద్దరు అధికారులు, ఒక ట్రైనీ బొగ్గు బావిలోనే చనిపోయారు. ముగ్గురిని రెస్య్కూ టీమ్ కాపాడింది. బొగ్గు గనుల ప్రమాదాలలో చిక్కుకున్నవారిని రక్షించేందుకు సంస్థ పరంగా రెస్క్యూ ఉద్యోగులను నియమించుకున్నారు. 'ది మైన్స్ రెస్క్యూ రూల్స్ 1985' మార్గదర్శకాలు, బొగ్గు గనుల చట్టం 1952, బొగ్గు గనుల నిబంధనలు 2017, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ (డీజీఎంఎస్) పర్యవేక్షణలో, అధికారులు,సూపర్‌వైజర్‌లు, కార్మిక సంఘాల ప్రాతినిధ్యంతో పని స్థలాల రక్షణ ఏర్పాట్లు కొనసాగుతాయి. కానీ సేఫ్టీ త్రైపార్టీయేట్ సమావేశాలు సక్రమంగా జరగడం లేదు. అధికారుల వైయుక్తిక విధానాలే కొనసాగుతున్నాయి.
రూల్స్ కు వ్యతిరేకంగా
ఇటివల కొమురం భీం ఆసిఫాబాద్ ముఖ్య అధికారి సింగరేణి శ్రీరాంపూర్, మందమర్రి ఏరియా జనరల్ మేనేజర్‌కు ఫోన్ చేసి దహెగాం మండలం పెద్ద వాగు వరదలో చిక్కుకున్నవారిని కాపాడటానికి రెస్క్యూ సిబ్బందిని పంపించమని ఆదేశించారు. దీంతో అధికారులు చిలుక సతీశ్, అంబాల రాము, మధుకర్, తిరుపతి, గణేష్ నర్సింగ్‌తో కూడిన ఆరుగురు సభ్యుల రెస్క్యూ బృందాన్ని దహెగాం మండలం పెసరకుంట గ్రామానికి ప్రత్యేక వాహనంలో పంపించారు. అక్కడ వరదలో చిక్కుకున్నవారిని కాపాడే క్రమంలో చిలుక సతీశ్, అంబాల రాము వరద ఉధృతిలో కొట్టుకుపోయారు. జూలై 14న శవాలై తేలారు. 'ది మైన్స్ రెస్క్యూ రూల్స్ 1985' ప్రకారం సేప్టీవారిని వరదలో ఈదడానికి పంపకూడదు. ఇప్పటికే సింగరేణి బొగ్గు ప్రమాదాల వలన కార్మిక కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
ఇక స్వరాష్ట్రంలో సింగరేణి అధికారుల వైయుక్తిక విధానాల వలన, రాష్ట్ర ప్రభుత్వ అధికార జోక్యం వలన వరదలలో కూడా ప్రాణాలు కోల్పోయే దుస్థితి వచ్చింది. వరదలో చిక్కుకున్నవారి కోసం 'నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్‌డీఆర్ఎఫ్), స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎస్‌డీఆర్‌ఎఫ్) బృందాలను, సుశిక్షిత రెస్క్యూ బృందాలను వినియోగించుకోవాలి. వారికి లైఫ్ జాకెట్, వాటర్ హెల్మెట్, వాటర్ గ్లౌసెస్, వాటర్ షూ, పడవలను సమకూర్చి వరద సహాయక చర్యలు చేపట్టాలి. రక్షణ కల్పించకుండా, చట్టాలకు విరుద్ధంగా, బలవంతంగా వినియోగించుకుని సింగరేణి రెస్క్యూ ఉద్యోగుల మరణానికి కారణమయ్యారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించి వారి కుటుంబాలకు కోటి రూపాయల ఆర్థిక సహాయం, వారి పిల్లలకు మెరుగైన విద్య, డిపెండెంట్‌లకు ఉద్యోగం కల్పించాలి. బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకుని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి.
మేరుగు రాజయ్య
కేంద్ర కార్యదర్శి
సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్
9441440791.