మృదుభాషి రాంనాథ్ కోవింద్

భారత రాజ్యాంగంలోని 52 వ అధికరణ ప్రకారం దేశం 'రాష్ట్రపతి'ని కలిగి ఉండాలి. 53 వ రాజ్యాంగ అధికరణ ప్రకారం పరిపాలనాపర వ్యవహారాలను రాష్ట్రపతి ప్రత్యక్షంగా తానుగానీ, president elections...

Update: 2022-06-10 18:45 GMT

ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న నేత. రాష్ట్రపతిగా ఎన్నికయ్యే ముందు బిహార్ గవర్నర్‌గా ఉన్నారు. 2017లో ఎన్డీయే కూటమి ఉమ్మడి అభ్యర్థిగా రాంనాథ్ కోవింద్‌ను బలపరచగా 65.65 శాతం ఓట్లు సాధించి భారత 14 వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఈయన ఎంతో దాతృత్వం గలవారు. తనకు వారసత్వంగా వచ్చిన ఇంటిని ఆర్ఎస్ఎస్‌కు విరాళంగా ఇచ్చారు. తన కూతురు 'స్వాతి కోవింద్' ఎయిర్ ఇండియాలో సాధారణ ఉద్యోగి. భారత రాష్ట్రపతిగా ఆయన 28 దేశాలలో అధికారికంగా పర్యటించారు. ఆయనకు నేషనల్ ఆర్డర్ ఆఫ్ మడగాస్కర్, ఆర్డర్ ఆఫ్ ఇండిపెండెన్స్, ఆర్డర్ ఆఫ్ లయన్,గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ కింగ్ తోమిస్లావ్, ఆర్డర్ ఆఫ్ ది కాండర్ ఆఫ్ ది ఆండెస్, నేషనల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ లాంటి అత్యున్నత పురస్కారాలతో వివిధ దేశాలు ఆయనను సత్కరించాయి.

భారత రాజ్యాంగంలోని 52 వ అధికరణ ప్రకారం దేశం 'రాష్ట్రపతి'ని కలిగి ఉండాలి. 53 వ రాజ్యాంగ అధికరణ ప్రకారం పరిపాలనాపర వ్యవహారాలను రాష్ట్రపతి ప్రత్యక్షంగా తానుగానీ, తనకు అనుబంధంగా విధులు నిర్వర్తించే అధికారుల ద్వారా కానీ సజావుగా కొనసాగేలా చూడాలి. రాష్ట్రపతి పదవిని అలంకరించిన వారిని దేశ 'ప్రథమ పౌరుడి'గా పరిగణిస్తారు. ప్రస్తుతం భారత 14 వ రాష్ట్రపతిగా కొనసాగుతున్న రాంనాథ్ కోవింద్ పదవీకాలం ఈ నెల 24న ముగియనుంది. దేశంలో మరోసారి రాష్ట్రపతి ఎన్నికల కాక మొదలైంది. అధికార, విపక్ష పార్టీలు ఎవరికి వారు తమ అభ్యర్థిని గెలిపించుకోవాలనే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. స్వాతంత్ర్యానంతరం 2 మే 1952 న జరిగిన ఎన్నికలలో డా. బాబూ రాజేంద్రప్రసాద్ తొలి రాష్ట్రపతిగా గెలుపొందారు.1957లోనూ రెండవసారి ఆయన రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. దీంతో రెండుసార్లు రాష్ట్రపతిగా ఎన్నికైన నేతగా చరిత్ర పుటలలో నిలిచిపోయారు.

వీవీ గిరి స్వతంత్ర అభ్యర్థిగా నిలిచి, నాలుగవ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. దేశ అత్యున్నత పదవిని అలంకరించిన తొలి తెలుగు నేత. రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ 'ఎలక్టోరల్ కాలేజ్' విధానంలో 'ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా' పర్యవేక్షణలో జరుగుతుంది. చట్ట సభల సభ్యులు అనగా, 543 మంది లోక్‌సభ సభ్యులు, 233 మంది రాజ్యసభ సభ్యులు, కేంద్రపాలిత ప్రాంతాలు సహా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన 4,120 మంది శాసనసభ్యులు వెరసి 4,896 మంది ఓటర్లుగా ఉన్నారు. ఓటు హక్కు వినియోగించుకోవడానికి నామినేటెడ్ సభ్యులు అనర్హులు. లోక్‌సభ, రాజ్యసభ సభ్యుడి ఓటు విలువ 708 కాగా, శాసనసభ్యుల ఓటు విలువ మాత్రం ఆయా నియోజకవర్గంలోని జనాభా ఆధారంగా నిర్ణయించబడుతుంది.

నిరాడంబరత గల నేత

ప్రస్తుత రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ విలక్షణ వ్యక్తిత్వం గలవారు. 1945 అక్టోబర్ ఒకటిన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లా ఫరౌఖ్ గ్రామంలోని నిరుపేద దళిత కుటుంబంలో జన్మించారు. దేశ అత్యున్నత రాజ్యాంగ పదవినలంకరించిన కోవింద్ మృదు స్వభావి. నిరాడంబరత, మిత భాష్యం ఆయన వ్యక్తిగత ఆభూషణాలు. 'ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండడం' అనే సామెతకు నిలువెత్తు నిదర్శనం. వాణిజ్యశాస్త్రంలో పట్టభద్రుడై ఆ తరువాత కాన్పూర్ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం అభ్యసించారు. సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినప్పటికీ ఐఏఎస్ కావాలన్న తన కల నెరవేరకపోవడంతో న్యాయవాద వృత్తిని ఎంచుకున్నారు. కేంద్ర ప్రభుత్వ న్యాయవాదిగా ఢిల్లీ హైకోర్టులో, సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వ స్టాండింగ్ కౌన్సిల్‌గా పనిచేశారు.రెండు పర్యాయాలు ఉత్తరప్రదేశ్ నుండి రాజ్యసభ సభ్యుడిగా, బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా, అఖిల భారత కోలీ సమాజ్ అధ్యక్షుడిగా పనిచేశారు.

దేశ తొలి కాంగ్రెసేతర ప్రధానమంత్రి మొరార్జీ దేశాయికి వ్యక్తిగత కార్యదర్శిగా సేవలందించారు.ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉన్న నేత. రాష్ట్రపతిగా ఎన్నికయ్యే ముందు బిహార్ గవర్నర్‌గా ఉన్నారు. 2017లో ఎన్డీయే కూటమి ఉమ్మడి అభ్యర్థిగా రాంనాథ్ కోవింద్‌ను బలపరచగా 65.65 శాతం ఓట్లు సాధించి భారత 14 వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. ఈయన ఎంతో దాతృత్వం గలవారు. తనకు వారసత్వంగా వచ్చిన ఇంటిని ఆర్ఎస్ఎస్‌కు విరాళంగా ఇచ్చారు. తన కూతురు 'స్వాతి కోవింద్' ఎయిర్ ఇండియాలో సాధారణ ఉద్యోగి. భారత రాష్ట్రపతిగా ఆయన 28 దేశాలలో అధికారికంగా పర్యటించారు. ఆయనకు నేషనల్ ఆర్డర్ ఆఫ్ మడగాస్కర్, ఆర్డర్ ఆఫ్ ఇండిపెండెన్స్, ఆర్డర్ ఆఫ్ లయన్,గ్రాండ్ ఆర్డర్ ఆఫ్ కింగ్ తోమిస్లావ్, ఆర్డర్ ఆఫ్ ది కాండర్ ఆఫ్ ది ఆండెస్, నేషనల్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ లాంటి అత్యున్నత పురస్కారాలతో వివిధ దేశాలు ఆయనను సత్కరించాయి.

ఈసారి ఎవరు?

లోక్‌సభలో బీజేపీ సారథ్యంలోని ఎన్‌డీఏ 49.9 శాతం ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లు కలిగి ఉండగా, కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏకు 25.3 శాతం ఓట్లు మాత్రమే ఉన్నాయి. రాజ్యసభలో మాత్రం ఎన్‌డీఏకు తగినంత బలం లేదు. రాంనాథ్ కోవింద్‌ను బరిలో నిలిపినపుడు బీజేపీ కూటమి దేశవ్యాప్తంగా దాదాపు 70 శాతం అధికారాన్ని కలిగి ఉండగా, అది ఇప్పుడు 45 శాతానికి దిగజారింది. ఇటీవలి కాలంలో కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వంతో తీవ్రంగా విభేదిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు బీజేపీయేతర పార్టీలను ఒక్క గాటన చేర్చి అధికార పక్ష అభ్యర్థిని దేశ ప్రథమ పౌరుడి పదవికి ఎన్నిక కాకుండా చేయాలని యత్నిస్తున్నారు.

ప్రాంతీయ పార్టీలు, బీజేపీయేతర ముఖ్యమంత్రుల మద్దతు కోసం సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ప్రముఖ సంఘ సేవకుడు అన్నా హజారేను ఉమ్మడి అభ్యర్థిగా నిలపాలనే ఆలోచనతో ఉన్నట్లు సమాచారం. జార్ఖండ్ మాజీ గవర్నర్, గిరిజన నాయకురాలు ద్రౌపది ముర్మును ఉమ్మడి అభ్యర్థినిగా బరిలోకి దింపాలని బీజేపీ యోచిస్తున్నట్టు తెలిసింది. ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేరు కూడా పరిశీలనలో ఉందని చెబుతున్నారు.

యేచన్ చంద్రశేఖర్

హైదరాబాద్, 88850 50822

Tags:    

Similar News