జైళ్ల‌లో సంస్కరణలు అమలు చేయరా?

మన దేశంలో జైళ్ల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. బ్రిటిష్ కాలం నాటి నుంచి పరిస్థితుల్లో పెద్దగా మార్పులు రాలేదు. పరిమితమైన జైలు గది వైశాల్యంలో

Update: 2024-10-17 00:45 GMT

మన దేశంలో జైళ్ల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. బ్రిటిష్ కాలం నాటి నుంచి పరిస్థితుల్లో పెద్దగా మార్పులు రాలేదు. పరిమితమైన జైలు గది వైశాల్యంలో ఇద్దరు ఖైదీలు ఉండాల్సిన చోట ఐదుగురిని ఉంచుతున్నారు. రోజురోజుకూ సమాజంలో నేర ప్రవృత్తి పెరుగుతోంది. మొన్న సుప్రీంకోర్టు ఖైదీల పట్ల 'కులం' ఆధా రంగా నీచ పనులను అప్పగించే పనితీరును తీవ్రంగా ఆక్షేపించింది. మన దేశంలో కొద్ది మంది రాజకీయ నేతలు, కీలక శాఖలు నిర్వహించిన ఉన్నత స్థాయి ప్రభుత్వ అధికారులు ఏదో కారణాలతో జైలుకు వెళ్లి వచ్చిన వారే. ఆ ఖైదు జీవితపు చేదు అనుభవాలు రుచి చూసిన వారే.. కనుక వారికి ఆ దుస్థితి గురించి వివరించి చెప్పే పనిలేదు. కనుక జైళ్ల మ్యాన్యువల్‌లో తగిన సంస్కరణలు చేపట్టాలి.

ముల్లా కమిటీ సిఫార్సులు..

జైళ్ల పరిస్థితులపై ఖైదీల ఆవేదనలు, అగచాట్లు మీడి యాలో అనేకసార్లు వెల్లడించడంతో 1980లో కేంద్ర ప్రభుత్వం 'అఖిల భారత జైళ్ల సంస్కరణల కమిటీని' వేసింది. దాన్నే 'ముల్లా కమిటీ' అని కూడా పిలుస్తారు. దేశంలో ప్రధాన జైళ్లను ప్రత్యేకంగా దర్శించింది. వారు ఖైదీలను ప్రశ్నించి, స్వయంగా అక్కడి పరిస్థితులను చూసి ఈ కమిటీ మొత్తం 658 సిఫార్సులు చేసింది. వాటిలో ముఖ్యమైనవి.. మన దేశంలో జైళ్లు 130 శాతం ఆక్యుపెన్సీ రేట్‌తో రద్దీ ఎక్కువగా ఉంటున్నాయని. దీన్ని తగ్గించేందుకు ఖైదీల విభజన చేయాలని, అలాగే జైలు ప్రధాన కార్యాలయాల ఏర్పాటు, సిబ్బందికి శిక్షణతో సహా జైలు మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని సూచించింది. అదనంగా, ఖైదీలను సన్నద్ధం చేయడానికి వృత్తిపరమైన శిక్షణ, కౌన్సెలింగ్ సేవలు, విద్య, వైద్యం, వినోదం అందించాలి. ఉపాధి నైపుణ్యాలు మెరుగుపరచాలి. ఖైదీల ఆరోగ్యం, పరిశుభ్రత ప్రధాన సమస్యలుగా ఉన్నాయి. ఉన్నత అధికారులు, స్థానిక రాజకీయ నేతలు క్రమం తప్పకుండా జైళ్ల పరిస్థితులపై తనిఖీలు నిర్వహించాలని కోరింది. అనారోగ్య పీడితులకు సకాలంలో చికిత్సతో పాటు, వైద్య సదుపాయాలను మెరుగుపరచాలి. పరిశుభ్రమైన జీవన పరిస్థితులు కల్పిం చాలి. ప్రాథమిక అసౌకర్యాలను వెంటనే నిర్ధారించి, మెరుగైన శాశ్వత పనులు చేపట్టాలని సిఫార్సు చేసింది. ఖైదీల ఆరోగ్యాన్ని కాపాడేందుకు పౌష్టికాహారం, సురక్షితమైన మంచినీరు అందించడం చాలా అవసరం. మహిళా ఖైదీలకు ప్రత్యేక సంరక్షణ అందించడం, పేద ఖైదీల బెయిల్ కోసం నిధిని సమకూర్చటం కూడా చాలా ముఖ్యమైనవి. జైళ్లలో ఖైదీ గ్రూపుల మధ్య హింసను నిర్మూలించాలి. సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వాలి. జైలు నిర్వహణను కుల, మత తదితర వివక్షలకు అతీతంగా శాస్త్రీయంగా, మానవతా స్ఫూర్తితో మెరుగు పరచాలని ఆ కమిటీ సూచించింది.

సూచనలు సరే ఆచరణ ఏది?

జైళ్ల సంస్కరణలపై ముల్లా కమిటీ అనేక విలువైన సూచనలు చేసి నాలుగు దశాబ్ధాలు గడిచినా ఇప్పటికీ పూర్తిగా వాటిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయ డం లేదు. ఏవో అక్కడక్కడ అరకొర సూచనలు మాత్రం అమలు చేస్తున్నారు. ఈ సంస్కరణల అమలుకు బహు ముఖ, క్రియాశీలక ఆచరణ విధానం అవసరం. ముల్లా కమిటీ సంస్కరణలను అమలు చేయడం ద్వారా, భారతదేశం తన జైలు వ్యవస్థను మరింత మానవీయ, నాగరిక పునరావాస సంస్థగా మార్చగలదు. ఇది ఖైదీల జీవితాలను మెరుగుపరచడమే కాకుండా సురక్షితమైన, మరింత న్యాయవంతమైన సమాజానికి దోహదం చేస్తుంది.

-డా. కిషోర్ ప్రసాద్

98493 28496

Tags:    

Similar News