ఫాసిజాన్ని ప్రతిఘటించండి
సీపీఐ (ఎంఎల్) 53 వ వార్షికోత్సవం ఏప్రిల్ 22, 2022 న జరుపుకొంది. ఈ చరిత్రాత్మక సందర్భంగా, సీపీఐ (ఎంఎల్) సభ్యులు, మద్దతుదారులందరికీ కేంద్ర కమిటీ హృదయపూర్వక విప్లవ శుభాకాంక్షలు తెలియజేస్తుంది.
2024 ప్రారంభంలో మనం కీలక లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొంటాము. ఈ కర్తవ్యాలు పరిపూర్తి కోసం యావత్తు పార్టీని క్రియాశీలంగా అభివృద్ధి చేయాలి. క్యాండిడేట్ సభ్యులను పెద్ద ఎత్తున చేర్చుకోవడం ద్వారా పార్టీని కొత్త ప్రాంతాలకు మరియు కొత్త వర్గాల ప్రజలలో విస్తరించడం, పార్టీ కమిటీలు మరియు శాఖల పనితీరును మెరుగుపరచడం ద్వారా పార్టీ ఐక్యతను, పోరాట శక్తిని బలోపేతం చేయడం, పార్టీ క్రమశిక్షణను కఠినంగా పాటించడం పార్టీని ఉన్నత స్థాయికి వెళ్లడం. పార్టీ పత్రికలు మరియు మార్క్సిస్ట్ సాహిత్యాన్ని తీవ్రంగా అధ్యయనం చేయడం ద్వారా పార్టీ సైద్ధాంతిక - రాజకీయ స్థాయి పెంచడం - పెద్ద ఎత్తున ప్రజా సంబంధాలు, సామూహిక పోరాటాల కొనసాగిస్తూ మన రోజువారీ బాధ్యతలను నిర్వర్తిస్తూ మనం ఈ దిశలో ముందుకు సాగాలి.
సీపీఐ (ఎంఎల్) 53 వ వార్షికోత్సవం ఏప్రిల్ 22, 2022 న జరుపుకొంది. ఈ చరిత్రాత్మక సందర్భంగా, సీపీఐ (ఎంఎల్) సభ్యులు, మద్దతుదారులందరికీ కేంద్ర కమిటీ హృదయపూర్వక విప్లవ శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ప్రజాస్వామ్యం, ప్రజల హక్కుల కోసం అన్ని అసమానతలకు వ్యతిరేకంగా పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలనే పార్టీ సంకల్పాన్ని పునరుద్ధరిస్తుంది. ఇది కామ్రేడ్ లెనిన్ 152 వ జయంతి కూడా. కామ్రేడ్ లెనిన్, మన వ్యవస్థాపక, అమరులైన నాయకులు, అమరవీరులందరికీ మన గౌరవప్రద నివాళులర్పిస్తున్నాము. ఈ ఏడాది చివర్లో, జూలై 28న కామ్రేడ్ చారు మజుందార్ 50వ వర్ధంతిని, డిసెంబర్ 10న కామ్రేడ్‌లు జగదీష్ మాస్టర్, రామాయణ రామ్ 50వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటాం.
గత రెండు సంవత్సరాలుగా కోవిడ్ 19 మహమ్మారి, దానిని ఎదుర్కోనే పేరుతో దేశంలో అమలు చేసిన క్రూరమైన లాక్‌డౌన్ అమలు చేయబడింది. అయినప్పటికీ, భారతదేశ ప్రజలు, మన పార్టీ ప్రజల ప్రాథమిక డిమాండ్లు, హక్కులపై అనేక పోరాటాలను విజయవంతంగా నిర్వహించడం జరిగింది. చారిత్రాత్మక రైతుల ఉద్యమం కార్పొరేట్ అనుకూల వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని మోడీ ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసింది. అన్ని పంటలకు, కౌలుదార్లు, అన్ని వర్గాల రైతులకు న్యాయమైన కనీస మద్దతు ధర సాధించడం కోసం శ్రామిక ప్రజలపై అన్ని రుణాలను రద్దు చేయడం కోసం, కార్మికులు మరియు ఉద్యోగార్ధులందరికీ సురక్షితమైన ఉద్యోగాలు జీవన వేతనాల కోసం పబ్లిక్ ఆస్తులను అమ్మడం కొంతమంది కార్పొరేట్లకు బదిలీ చేయడం ఆపడం కోసం ఇప్పుడు యుద్ధం జరుగుతోంది.
బలమైన ఐక్యత ఏర్పడాలి
ప్రతి ఎన్నికల విజయం బీజేపీని, సంఘ్ బ్రిగేడ్‌ని తమ ఫాసిస్ట్ దాడిని మరింత తీవ్రతరం చేసేందుకు ధైర్యాన్నిస్తుంది. 2019 విజయం తర్వాత, మోడీ త్వరగా ఆర్టికల్ 370ని రద్దు చేశారు. జమ్మూ-కాశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలకు కుదించారు. పౌరసత్వ చట్టాన్ని సవరించారు. ఈసారి యూపీ, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్‌లో బీజేపీ విజయాల తరువాత, వారు బీజేపీయేతర ప్రభుత్వాలను అస్థిరపరచడానికి, నితీష్‌కుమార్‌ను చాలా కాలంగా బీజేపీ తన ముఖంగా లేదా ముసుగుగా ఉపయోగిస్తున్న బిహార్ వంటి రాష్ట్రాల్లో తమ నియంత్రణను బిగించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇంధనం, ఆహారం, ఇతర నిత్యావసర వస్తువులు, సేవల ధరల భారీ పెరుగుదలతో వారు ప్రజలపై ఆర్థిక యుద్ధాన్ని తీవ్రతరం చేశారు. అదే సమయంలో విద్వేషం మరియు భయాన్ని ఇంజెక్ట్ చేయడం, హింసను ప్రేరేపించడం ద్వారా ప్రజలను మతపరమైన ధ్రువణంగా ఉంచారు.
సంక్షోభం తీవ్రమవుతున్నప్పటికీ, తప్పించుకోలేని విధిగా బీజేపీ పాలన, ఆర్‌ఎస్‌ఎస్ భావజాలాన్ని అంగీకరించేలా ప్రజలను నిరుత్సాహపరచి, భయపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ, భారత దేశ స్వాతంత్ర్యం 75వ వార్షికోత్సవం, మన స్వాతంత్ర ఉద్యమం శక్తివంతమైన విప్లవ వారసత్వాన్ని, భగత్‌సింగ్, అంబేద్కర్, పెరియార్, ఇతర వలస వ్యతిరేక కుల వ్యతిరేకులచే వెలిగించబడిన స్వేచ్ఛా, ప్రగతిశీల, సమానత్వ భారతదేశం గొప్ప కలలను మనకు గుర్తు చేస్తూనే ఉంది. వారికి ముందున్న యోధులు. ఆ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లి, స్వేచ్ఛ, న్యాయం, ప్రజాస్వామ్యం కోసం పోరాటాన్ని ఉధృతం చేయడం ద్వారా ఫాసిస్ట్ బారి నుండి భారతదేశాన్ని విడిపించాల్సిన బాధ్యత ఇప్పుడు మనపై ఉంది. దీని కోసం మనం అన్ని వామపక్ష, ప్రగతిశీల మరియు పోరాట శక్తుల బలమైన ఐక్యతను ఏర్పరచాలి. మరియు ఎన్నికల రంగంలో శక్తివంతమైన ప్రభావం నేర్పేందుకు ప్రజల ఎజెండా మరియు పోరాటాలను నిర్దేశించాలి.
క్రియాశీలకంగా ఉద్యమించాలి
ఈ చరిత్రాత్మక కర్తవ్యాన్ని నిర్వహించేందుకు పార్టీని విస్తరించి బలోపేతం చేయాలి. వచ్చే ఏడాది ప్రారంభంలో, మనం పార్టీ 11వ కాంగ్రెస్‌ను పాట్నాలో నిర్వహించబోతున్నాం. 2024 ప్రారంభంలో మనం కీలక లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొంటాము. ఈ కర్తవ్యాలు పరిపూర్తి కోసం యావత్తు పార్టీని క్రియాశీలంగా అభివృద్ధి చేయాలి. క్యాండిడేట్ సభ్యులను పెద్ద ఎత్తున చేర్చుకోవడం ద్వారా పార్టీని కొత్త ప్రాంతాలకు మరియు కొత్త వర్గాల ప్రజలలో విస్తరించడం, పార్టీ కమిటీలు మరియు శాఖల పనితీరును మెరుగుపరచడం ద్వారా పార్టీ ఐక్యతను, పోరాట శక్తిని బలోపేతం చేయడం, పార్టీ క్రమశిక్షణను కఠినంగా పాటించడం పార్టీని ఉన్నత స్థాయికి వెళ్లడం. పార్టీ పత్రికలు మరియు మార్క్సిస్ట్ సాహిత్యాన్ని తీవ్రంగా అధ్యయనం చేయడం ద్వారా పార్టీ సైద్ధాంతిక - రాజకీయ స్థాయి పెంచడం - పెద్ద ఎత్తున ప్రజా సంబంధాలు, సామూహిక పోరాటాల కొనసాగిస్తూ మన రోజువారీ బాధ్యతలను నిర్వర్తిస్తూ మనం ఈ దిశలో ముందుకు సాగాలి. మన ప్రియతమ నాయకులు, మరియు అమరవీరులందరికీ రెడ్ సెల్యూట్. ఫాసిస్ట్ వ్యతిరేక ప్రతిఘటనను వ్యాప్తి చేసే శక్తివంతమైన, నిబద్ధత గల పార్టీగా సీపీఐ (ఎంఎల్) ను అభివృద్ధి చేద్దాం.
దీపాంకర్ భట్టాచార్య
సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ జాతీయ కార్యదర్శి