కవిత: మాతృభాషే ..మన భాష

కవిత: మాతృభాషే ..మన భాష... poem on International Mother Language Day

Update: 2023-02-20 18:30 GMT

మాతృమూర్తికి ప్రణమిల్లుతూ

మాతృదేవోభవ అని కీర్తిస్తూ...

అమ్మ ఒడిలో నేర్చిన మన తెలుగు భాష

పలికే ప్రతిపలుకు అమృత గుళికలే.

పరభాషా వ్యామోహంలో

మాతృభాషను దూరం చేస్తూ..

మన విలువలు మనమే కోల్పోతున్నాం కదా,

ఆంగ్లభాష వ్యామోహంలో

మాండలీక పదజాల ఉచ్చారణా మాధుర్యాన్ని

ఆస్వాదించలేక, మాతృభాషను కించపరిచే

దౌర్భాగ్య స్థితిలోకి దిగజారుతున్నాం...!

ఎండమావిలా ఆకర్షించే పరభాష వ్యామోహంలో

తెలుగు పదాల నుడికారాలు, అలంకార ఛందస్సుతో

హృదయ వీణలు మీటే

పద్యాల అర్థాలకు తిలోదకాలిస్తున్నాం.

అంకుల్, ఆంటీ అనే పిలుపులతో

మాతృదేవోభవ, పితృదేవోభవ, అని చెప్పే

మాతృభాషను కనుమరుగు చేస్తున్నాం..!

ధన వ్యామోహంతో విదేశాల్లో ఉద్యోగాల వేటలో

మాతృభాషను "ఆప్షన్"లా వాడేస్తున్నాం.

ఎంత ఎదిగినా, ఏ దేశంలో నివసిస్తున్నా!

సంపాదన ఎంతైనా

"దేశం భాషలందు తెలుగు లెస్స"

అని కీర్తించిన రాయలవారి మాట.

మనమాటగా విశ్వమంతా ప్రతిధ్వనించాలి..

మనుగడ కోసం ఇతర భాషలను నేర్చుకో... తప్పులేదు.

మాతృభాషపై మమకారం చంపుకోవడం తప్పు.

అమ్మా! అనే పిలుపులోని భాగ్యం దక్కించుకో

మమ్మీ అని పిలుస్తూ అమ్మను దూరం చేసుకోకు.

మన భాషను మనమే కాపాడుకుందాం.

మన ఉనికి మన భాషే అని చాటుకుందాం.

మంజుల పత్తిపాటి

9347042218

Tags:    

Similar News