దేశమంటే ఆకలి కేకలు కాదోయ్
కడుపునిండా బువ్వ పెట్టే
గుణమే దేశమోయ్
సమసమాజ నిర్మాణం ఏదోయ్
గుడిసెలే లేని అనాథలెందుకు ఉన్నారోయ్
దేశమంటే ఉన్న వాడికో న్యాయం
లేని వాడికో న్యాయం అసలే కాదోయ్,
దేశమంటే రైతోయ్
దేశమంటే సైనికుడోయ్
దేశమంటే నేతాజీ
దేశమంటే గాంధీజీ
దేశమంటే భగత్ సింగ్
దేశమంటే ఉక్కు మనిషి పటేల్
దేశమంటే అల్లూరి
దేశమంటే ఝాన్సీలక్ష్మి
గుణము లేకున్నా
పైసా ఉన్నవాడే
నాయకుడంటే ఎట్లోయ్
నీతిని న్యాయాన్ని పాతర పెట్టీ
స్వార్థమే పరమావధిగా
పాలన చేసేవాడు పిశాచ మేనోయ్
నారగొని ప్రవీణ్ కుమార్
98490 40195