కళ్లు కలల వాకిళ్లు

poem

Update: 2023-09-06 23:00 GMT

ఎన్నో చిత్రాలను చూస్తూ

ప్రతి కాలాన్ని గమనిస్తూ

నిశబ్దంగా తనలోనే దాచుకుంటూ!

క్షణాలను లెక్కేస్తూ

దృశ్యాలను కుప్పేస్తూ

నిలువెల్లా తడుముతాయి!

నిజాన్ని పసికడుతాయి

వాటికి విశ్వమంతా ఒక్కటే

ఏ విషయమైనా ఒక్కటే!

జ్ఞానానికి గమనాన్ని సూచిస్తూ

చేతికి కర్రలా తెలివికి బుర్రలా

కాలానికి దృశ్యమానం!

రెప్పలను పెదాలుగా చేసుకొని

నిశబ్దంగా పలుకరిస్తాయి

ఘటనలను దృశ్యాలుగా

భద్రపరుస్థాయి!

మధుర క్షణాలను బంధించి

అందమైన జ్ఞాపకాలుగా నిలుపుతాయి

మరచిపోని అనుభూతులుగా ఉండేలా!

ఆవేదనలకు వర్షిస్తాయి

ఆనందాలను ఆవిష్కరిస్తాయి

భావాలను మౌనంగా పలుకుతాయి!

అవే కళ్ళు, చూపులకు ఇండ్లు!

కలలకు అందమైన వాకిళ్ళు!!

జగ్గయ్య జి

98495 25802

Tags:    

Similar News