ఓబీసీ రిజర్వేషన్స్ పెంచాల్సిందే!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్స్ కల్పించడంలో క్రియాశీలక పాత్ర నిర్వహించిన మహనీయులు బీపీ మండల్ పుంజాల
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్స్ కల్పించడంలో క్రియాశీలక పాత్ర నిర్వహించిన మహనీయులు బీపీ మండల్ పుంజాల శివశంకర్ స్ఫూర్తితో సమగ్ర కుల జనగణన స్థానిక సంస్థలలో 42% బీసీ రిజర్వేషన్స్ పెంపుదల కోసం జరుగతున్న ఉద్యమాన్ని విజయవంతం చేద్దాం. బీసీలకు రాజ్యాధికారంలో సమ ప్రాతినిధ్యం ద్వారానే సమ సమాజ నిర్మాణం ద్వారానే సుసాధ్యం అవుతుంది. ఎన్నో సంవత్సరాలుగా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వెనుకకు నెట్టబడిన కులాలు బీసీలు..నేడు మన బీసీల అస్తిత్వం కను మరుగు చేసేందుకు అగ్ర, ఆధిపత్య కులాలు పోటీ పడి బీసీలను రాజకీయంగా ఆర్థికంగా ఎదుగకుండా అడ్డుకుంటూ మన వృత్తులలో కార్పొరేట్ శక్తులను చొప్పించి ప్రోత్సహించి తద్వారా బీసీల అవకాశాలను కొల్లగొడుతూ బీసీ కులాల వృత్తులను ధ్వంసం చేస్తున్నాయి.
తమిళనాడు తరహాలో..
బీసీలు ఇప్పటికైనా రాజకీయ చైతన్యాన్ని ప్రదర్శించి తమ ఓట్లతో బీసీలను మాత్రమే ఎంఎల్ఏ, ఎంపీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ సర్పంచ్‌లుగా చట్టసభలలోకి పంపడం ద్వారా సమస్త బీసీ కులాల అభివృద్ధిని అన్ని రంగాల్లో ప్రదర్శించవచ్చు. రాజ్యాధికారంలో బీసీలు పట్టు సాధించాలంటే జనరల్ స్థానాలలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా అగ్ర, ఆధిపత్య కులాలను ఓడగొట్టి బీసీ అభ్యర్థులను మాత్రమే గెలిపించడం ద్వారా చట్టసభలలో బీసీల జనాభా దామాషా ప్రకారం అవకాశాలు అందుకోగలరు.. తద్వారా విద్యా, ఉద్యోగ రంగాలతో పాటు బడ్జెట్ కేటాయింపుల ద్వారా అన్ని రంగాల్లో అవకాశాలను అందిపుచ్చుకోవడం ద్వారా ఆర్థిక అభివృద్ధి మన బీసీ కులాలలో సాధ్యం అవుతుంది. రాబోయే అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో జనరల్ స్థానాలలో మెజారిటీగా బీసీలను గెలిపించుకునే విధంగా ఇప్పటి నుండే బీసీ కులాలు వ్యూహరచన చేసుకోవాలి. ఇక్కడి ప్రభుత్వం సైతం తమిళనాడు తరహాలో చట్ట సవరణ చేసి బీసీలకు విద్యా, ఉద్యోగ, స్థానిక సంస్థలలో ఇతర రంగాలలో రిజర్వేషన్స్ పెంచాలి.
చెన్న శ్రీకాంత్
వైస్ ప్రెసిడెంట్, సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా
70369 88999