కళ్లు తెరిచిన న్యాయదేవత

madras highcourt gave sensational justice on 30 yrs old case

Update: 2023-10-02 22:45 GMT

మద్రాస్ హైకోర్టు ఒక మంచి తీర్పు వెలువరించింది. మూడు దశాబ్దాల క్రితం జరిగిన హీన నేరంపై సెషన్స్ కోర్టు ఇచ్చిన తీర్పుని సమర్థిస్తూ తీర్పునిచ్చింది. తమిళనాడులో వచాతి గిరిజన గ్రామంపై 269 మంది రెవెన్యూ, అటవీ, పోలీసు ప్రభుత్వ అధికారులు దాడి చేసి వీరప్పన్‌కి సహకరిస్తున్నారన్న మిషతో ఊరు తగలబెట్టారు.18 మందిపై అత్యాచారం చేశారు. బాధిత గ్రామస్తులు రిపోర్ట్ చేసినా పోలీసులు కేసు నమోదు చేయలేదు. తిరిగి వారిపైనే కేసులు పెట్టారు. ప్రభుత్వం వైపు నుండి సహకారం అందకపోగా అడ్డంకులు ఎదురైనా దుస్థితి. వారంతా ప్రజా సంఘాల మద్దతు తో మద్రాస్ హై కోర్టుని ఆశ్రయించగా, ఉన్నత న్యాయస్థానం స్పందించి

సీబీఐకి కేసు అప్పగించింది. తర్వాత నేరం నిరూపణ జరిగి అప్పటికి బతికి ఉన్న నిందితులందరినీ ముద్దాయిలుగా గుర్తించింది సెషన్స్ కోర్టు. శిక్ష పడ్డ 215 మంది ముద్దాయిలు హైకోర్టుని ఆశ్రయించగా వారి నేరాన్ని ధృవీకరిస్తూ మొన్న తీర్పు వెలువడింది. అందరికీ వారివారి నేరాల బట్టి శిక్షలు ఖరారు అవ్వడమే కాకుండా బాధితులకు పరిహారం చెల్లించాలని కోర్టు చెప్పింది. ప్రభుత్వ అధికారులు నిందితులుగా ఉన్న ఈ కేసులో అధికార కేంద్రం నుండి ఎన్ని అడ్డంకులు ఎదురైనా చివరకు న్యాయం బలహీనులకు చేరడం ఊరట. ఆలస్యమైనా న్యాయం దక్కడం వ్యవస్థపై నమ్మకం పెంచుతుంది. బలహీనులకు భరోసా ఇచ్చే చట్టమూ.. తీర్పు. మూడు దశాబ్దాలుగా పోరాట పటిమ చూపిన బాధితులు, వారికి అండగా నిల్చిన పౌర సమాజం, దర్యాప్తు సంస్థ, న్యాయపాలిక ప్రశంసా పాత్రులు.

డా. డి.వి.జి.శంకర రావు

మాజీ ఎంపీ,

94408 36931

Tags:    

Similar News