ఐర్లాండ్ ప్రధానిగా మళ్లీ లియో

ఐర్లాండ్ ప్రధానిగా మళ్లీ లియో... leo again elected as ireland prime minister

Update: 2022-12-21 18:30 GMT

మొదటి సారి ప్రధాని అయినప్పుడు లియో వయసు 38 యేండ్లు. ఐర్లాండ్ చరిత్రలో అతి పిన్న వయసులో ప్రధాని అయిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు. తాను స్వలింగ సంపర్కుడినని 2015లో బహిరంగంగా ప్రకటించారు. ఫైన్ గేల్, మార్టిన్ ఫియాన్నా ఫెయిల్ పార్టీల మధ్య రొటేషన్‌లో మైకేల్ మార్టిన్ స్థానంలో టావోయిసాచ్ (ప్రీమియర్) గా వరద్కర్ నియమితులయ్యారు. 2020 ఎన్నికల తరువాత రొటేటింగ్ ప్రధాని పదవికి అంగీకరించారు. 43 సంవత్సరాల వయస్సులో ఆయన ఇప్పటికీ ఐర్లాండ్ అత్యంత పిన్న వయస్కుడైన నాయకులలో ఒకరు. ప్రధానిగా రెండవసారి కూడా ఉండటం విశేషం. టైమ్ మ్యాగజైన్-2018కి ఎంపిక చేసిన 100 మంది అత్యంత ప్రతిభావంత వ్యక్తులలో వరద్కర్ ఒకరు కావడం గమనార్హం.

భారతీయ సంతతికి చెందిన లియో వరద్కర్(leo varadkar) ఐర్లాండ్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఐర్లాండ్ దేశంలో మూడు రాజకీయ పార్టీల కూటమి చేసుకున్న ఒప్పందం మేరకు ప్రధానిగా ఉన్న మైకేల్ మార్టిన్(mikel martin) రాజీనామా చేయడంతో రెండవసారి వరద్కర్‌కు ప్రధాని పదవి తిరిగి లభించింది. ఇప్పటికే భారత మూలాలున్న కమలాహారిస్(kamala haris) అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నిక కాగా, ఇటీవలే రిషి సునాక్(rishi sunak) బ్రిటన్ ప్రధాని పదవిని చేపట్టిన విషయం తెలిసిందే. భారతీయ మూలాలు కలిగినవారు విదేశాలలో తమ శక్తియుక్తుల ద్వారా రాజకీయాలలో సత్తా చాటుతున్నారు. 43 యేళ్ల లియో ఇది వరకే ఒకసారి 2017లో ఐర్లాండ్‌ను పాలించారు.

17 డిసెంబర్ 2022న తిరిగి బాధ్యతలు స్వీకరించారు. లియో 18 జనవరి 1979న డబ్లిన్‌లో జన్మించారు. తండ్రి డాక్టర్ అశోక్ మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లా వరడ్ గ్రామానికి చెందినవారు. తల్లి మేరీ ఐర్లాండ్‌వాసి. నర్సుగా పని చేశారు. 1960లో వీరికి ఇంగ్లండ్‌లో పరిచయం కలిగింది. వివాహం తరువాత వీరు ఐర్లాండ్‌లో స్థిరపడ్డారు. లియో వీరి చిన్న కుమారుడు. లియో ప్రారంభ విద్య సెయింట్ ఫ్రాన్సిస్ నేషనల్ స్కూల్‌లో జరిగింది. డబ్లిన్ ట్రినిటీ కళాశాలలో మెడిసిన్ చదివారు.

మెడిసిన్ తరువాత రాజకీయాలు

మెడిసిన్ చదివాక లియో రాజకీయాలలోకి అడుగు పెట్టారు. 2007లో డబ్లిన్ వెస్ట్ నుంచి కౌన్సిలర్ అయ్యారు. ఆ సమయంలో ఆయనను రవాణా, పర్యాటకం, క్రీడల మంత్రిగా నియమించారు. జూలై 2014 లో జరిగిన కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో ఆరోగ్య మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 6 మే 2016న సామాజిక రక్షణ మంత్రిగా వరద్కర్‌ నియమితులయ్యారు. 2020లో ఉప ప్రధానిగా ఎన్నికయ్యారు. దేశం కొవిడ్ మహమ్మారితో పోరాడుతున్న సమయంలో ఆయన అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. ఇంటి నుంచి పని త్వరలో సాధారణమవుతుందని చెప్పారు. లియో 2017 నుంచి 2020 వరకు ఐర్లాండ్ ప్రధానిగా పనిచేశారు. మొదటి సారి ప్రధాని అయినప్పుడు లియో వయసు 38 యేండ్లు. ఐర్లాండ్ చరిత్రలో అతి పిన్న వయసులో ప్రధాని అయిన వ్యక్తిగా రికార్డు సృష్టించారు.

తాను స్వలింగ సంపర్కుడినని 2015లో బహిరంగంగా ప్రకటించారు. ఫైన్ గేల్, మార్టిన్ ఫియాన్నా ఫెయిల్ పార్టీల మధ్య రొటేషన్‌లో మైకేల్ మార్టిన్ స్థానంలో టావోయిసాచ్ (ప్రీమియర్) గా వరద్కర్ నియమితులయ్యారు. 2020 ఎన్నికల తరువాత రొటేటింగ్ ప్రధాని పదవికి అంగీకరించారు. 43 సంవత్సరాల వయస్సులో ఆయన ఇప్పటికీ ఐర్లాండ్ అత్యంత పిన్న వయస్కుడైన నాయకులలో ఒకరు. ప్రధానిగా రెండవసారి కూడా ఉండటం విశేషం. టైమ్ మ్యాగజైన్-2018కి ఎంపిక చేసిన 100 మంది అత్యంత ప్రతిభావంత వ్యక్తులలో వరద్కర్ ఒకరు కావడం గమనార్హం.


రామకిష్టయ్య సంగనభట్ల

94405 95494

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ dishaopinion@gmail.com, వాట్సప్ నెంబర్ 7995866672.

Also Read..

చైనాలో కరోనా విజృంభణ.. హస్సిటల్‌లో బెడ్లు లేక నేలపైనే CPR చికిత్స..

Tags:    

Similar News