కేసీఆర్@విజయీభవ

Update: 2022-04-26 18:30 GMT

తెలంగాణలో 'కేసీఆర్ కేంద్రం'గానే పార్టీ కార్యకలాపాలు, ప్రభుత్వ పాలనా వ్యవహారాలూ సాగుతున్నాయి. తనకు తెలియకుండా 'పక్షి కూడా రెక్కలు ఆడించదంటారు' అలాంటి అడ్మినిస్ట్రేషన్ ఆయనది. కేసీ‌ఆర్‌కు తన ఎత్తుగడలు, ఆలోచనల మీద పూర్తి నమ్మకం. 2014 ఎన్నికలలో టీఆర్‌ఎస్ 63 స్థానాలు గెలుచుకొని అధికారంలోకి వచ్చింది. వలసలు, ఉప ఎన్నికల ద్వారా తమ పార్టీ సభ్యుల సంఖ్యను 90 కి పెంచుకుంది. 2018లో 88 స్థానాలు సాధించి తిరిగి అధికారంలోకి వచ్చింది. సభ్యుల సంఖ్యను 100కు పెంచుకుంది.

'కాన్ఫిడెన్స్ గెయిన్స్ మౌంటెన్స్' అంటారు. కేసీఆర్‌కు ఇది పూర్తిగా వర్తిస్తుంది. ఆయన మీద ఆయనకు అపార నమ్మకం. అందరూ చెప్పింది వింటారు. ఆయనకు నచ్చిందే చేస్తారు. ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ వెంట నడిచింది లక్షలు, కోట్ల మంది ప్రజలు, ఉద్యమకారులు, రాజకీయ పార్టీలు, జేఏసీలు స్వచ్ఛంద సంస్థలు, మహిళలు, కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, యువకులు కళాకారులు, కుల సంఘాలు, మేధావులు, జర్నలిస్టులు. ఉద్యమములో జర్నలిస్ట్‌గా, సింగరేణి జేఏసీ చైర్మన్‌గా నేనూ భాగస్వామినయ్యాను. ఆనాడు కేసీఆర్‌తో గంటల తరబడి జరిపిన చర్చలు, ఆయనలోని తపన, ఆరాటం నాకు ఇంకా గుర్తున్నాయి. 2021 డిసెంబర్ 29న హైదరాబాద్‌లో ఒక ఫంక్షన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసా. 15 నిమిషాలు మాట్లాడుకున్నాం. ఉద్యమం సమయంలో నేను రాసిన 'తరతరాల పోరు' పుస్తకాన్ని కేసీఆర్ రిలీజ్ చేసారు. కేసీఆర్ దీక్ష, అరెస్ట్ నేపథ్యంలో సింగరేణి కార్మికుల సమ్మె, శ్రీకాంతాచారి ఆత్మహత్య తదితర అంశాలతో వచ్చిన మొదటి పుస్తకం ఇదే. దీని తర్వాత చాలా పుస్తకాలు వచ్చాయి.

తిరుగులేని పాలనా రీతి

తెలంగాణలో 'కేసీఆర్ కేంద్రం'గానే పార్టీ కార్యకలాపాలు, ప్రభుత్వ పాలనా వ్యవహారాలూ సాగుతున్నాయి. తనకు తెలియకుండా 'పక్షి కూడా రెక్కలు ఆడించదంటారు' అలాంటి అడ్మినిస్ట్రేషన్ ఆయనది. కేసీ‌ఆర్‌కు తన ఎత్తుగడలు, ఆలోచనల మీద పూర్తి నమ్మకం. 2014 ఎన్నికలలో టీఆర్‌ఎస్ 63 స్థానాలు గెలుచుకొని అధికారంలోకి వచ్చింది. వలసలు, ఉప ఎన్నికల ద్వారా తమ పార్టీ సభ్యుల సంఖ్యను 90 కి పెంచుకుంది. 2018లో 88 స్థానాలు సాధించి తిరిగి అధికారంలోకి వచ్చింది. సభ్యుల సంఖ్యను 100కు పెంచుకుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ భారీగా నష్టపోగా. టీడీపీ మిగలలేదు. టీపీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి రావడంతో కాంగ్రెస్ కొంత పుంజుకున్నది. బీజేపీ కూడా అధికారం మీద కన్నేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు, పంటల అభివృద్ధి, చెరువులు, కుంటల పునరుద్ధరణ, రైతుబంధు, షాదీ ముబారక్, కల్యాణ లక్ష్మి, ఆసరా పింఛన్లు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, ఆరోగ్యశ్రీ, కేసీఆర్ కిట్స్ టీఆర్ఎస్ విజయానికి సోపానాలు. తెలంగాణ, తెలంగాణేతర ప్రజల మధ్య చక్కని బ్రదర్‌హుడ్ వాతావరణం కొనసాగించడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారు.

అదే అతి పెద్ద సవాలు

ఏ పార్టీకి అయినా మూడోసారి గెలవడం పెద్ద సవాలు. దీనికి ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతున్న కేసీఆర్ 27న జరిగే టీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవంలో జాతీయ పార్టీని ప్రకటించే అవకాశం ఉంది. ఎమ్మెల్సీ కవితను జాతీయ పార్టీకి బాధ్యురాలిని చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. బోయినపల్లి వినోద్‌కుమార్ సమన్వయకర్తగా ఉంటారని అంటున్నారు. కేంద్రం బీజేపీయేతర రాష్ట్రాల మీద చూపుతున్న వివక్ష, ఈడీ, సీబీఐ, ఐటీ కేసులతో వేధించడం, దాడులు చేయడం, రాష్ట్ర హక్కులను హరించడం, ధాన్యం కొనుగోలులో అంతరాలు, 80-20 విద్వేష రాజకీయాలు, రైతులకు ఎం‌ఎస్‌పీ ఇవ్వకపోవడం, కేంద్రంలోని ఖాళీలు భర్తీ చేయకపోవడం, ప్రభుత్వరంగ సంస్థలను అమ్మడం, కోట్లాది మంది ఉద్యోగులు రోడ్ల మీదికి రావడం లాంటి ఎన్నో విషయాలలో కేంద్రంతో పోరాడవలసి ఉంది. విపక్షాలు ఒక వేదిక మీదకు రావాల్సిన అవసరం గురించి కేసీఆర్ 27న ప్లీనరీలో వివరించే అవకాశం ఉంది.

వీటి మీదా దృష్టి ఉంచాలి

టీఆర్ఎస్ నుంచి 2023 లో టికెట్లు ఆశిస్తున్న వారి సంఖ్య అనూహ్యంగా ఉన్నది. మరోవైపు పార్టీ కార్యకర్తలలో నిరాశ, నిరుత్సాహం, నిస్తేజం, నిర్వేదం కన్పిస్తున్నాయి. వారికి తగిన గుర్తింపు, ప్రాముఖ్యత లభించడం లేదన్న అపవాదు ఉన్నది. వలస వచ్చిన నాయకులు, కార్యకర్తలతో ఈ సమస్య వచ్చింది. ఈ అన్ని అంశాల మీద కేసీఆర్ సమీక్షించుకోవలసి ఉన్నది. రాజకీయ నాయకత్వాన్ని కంటే అధికారులకు ఎక్కువ ప్రాధాన్యత నివ్వడం, ఎవరితో చర్చించకుండా నిర్ణయాలను మొండిగా అమలు చేయడం లాభం కన్నా నష్టమే ఎక్కువ చేయవచ్చు. కేసీఆర్ 'బ్రాండ్' ఇమేజ్ తమను గట్టెక్కిస్తుందని సిట్టింగ్ ఎమ్మెల్యేలు అనుకుంటున్నారు. చాలా మంది ఎమ్మెల్యేల మీద ప్రజలలో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తున్నది. దీని మీద కూడా దృష్టి సారించాలి. అపర చాణక్యుడుగా పేరున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌కు అభినందనలు.

ఎండీ. మునీర్

జర్నలిస్ట్, కాలమిస్ట్

99518 65223

Tags:    

Similar News