ప్రైవేటీకరణను అడ్డుకోవడం అత్యవసరం!
పౌర విమానయాన రంగం జాతీయ ప్రయోజనాల దృష్టి కోణంలో చాలా కీలకమైనది. ఇది అన్ని రాష్ట్రాలను, దూరప్రాంతాలు, పర్వత ప్రాంతాలను సైతం
పౌర విమానయాన రంగం జాతీయ ప్రయోజనాల దృష్టి కోణంలో చాలా కీలకమైనది. ఇది అన్ని రాష్ట్రాలను, దూరప్రాంతాలు, పర్వత ప్రాంతాలను సైతం అనుసంధానం చేస్తుంది. అంతేకాకుండా, ప్రపంచ దేశాలతో రవాణా సంబంధాలను ఏర్పరుస్తుంది. ప్రకృతి విపత్తులు సంభవిస్తే, అక్కడి ప్రజలను వేగంగా రక్షణా స్థలాలకు తరలించడంలో ఈ రంగం ఎంతో తోడ్పడుతుంది. అందుకే, పౌర విమానయాన రంగం ప్రజా రంగంలో, ప్రభుత్వ ఆధ్వర్యంలో తప్పక ఉండాలి. అందుకే స్వతంత్ర భారతదేశంలో "ఎయిర్ కార్పొరేషన్ చట్టం-1953" అమలులోకి వచ్చింది. దీనివల్ల ఆ సమయంలో ఉన్న ఎనిమిది ప్రైవేటు విమానయాన కంపెనీలు విలీనం చేయబడి ప్రభుత్వ రంగ సంస్థలుగా "ఇండియన్ ఎయిర్ లైన్స్", "ఎయిర్ ఇండియా" రూపంలో ఏర్పడ్డాయి.
1990లలో గ్లోబలైజేషన్ వ్యాప్తి చెందడంతో పౌర విమానయాన రంగంలో ప్రైవేటీకరణకు అనుకూల వాతావరణం ఏర్పడింది. దీని ప్రవేశంతో ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వ రంగానికి వ్యతిరేక పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో అన్ని రంగాలతో పాటు పౌర విమానయాన రంగంలో కూడా ప్రైవేటీకరణ ప్రారంభమైంది. ఇక దేశంలో "నీతి ఆయోగ్" ఏర్పడి ప్రభుత్వాన్ని సమర్థవంతంగా 'నియో లిబరల్' విధానాలను అమలు చేయమని కేంద్రంపై ఒత్తిడి తెచ్చింది. ఈ చర్యలతో ప్రభుత్వ రంగంలో 100 శాతం ప్రైవేటీకరణ దిశగా ముందుకు సాగింది. అయితే, లిబరలైజేషన్, ప్రైవేటీకరణ ప్రక్రియలు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కోల్పోవడానికి అలాగే క్రమంగా ఆర్థిక అస్థిరతకు దారితీస్తుంది.
విమానాశ్రయాల ప్రైవేటీకరణ..
1990లో పబ్లిక్-ప్రైవేటు భాగస్వామ్య నమూనా ద్వారా విమానాశ్రయాల ప్రైవేటీకరణ ప్రారంభమైంది. ప్రస్తుతం విమానాశ్రయాల నిర్మాణంలో 100 శా తం విదేశీ పెట్టుబడికి గేట్లు బార్లా తెరచి ఆ హ్వానం పలుకుతున్నా రు. అయితే, ప్రైవేటీకరణ, కార్పోరేటీకరణ అనంతరం కూడా విమానయాన రంగం లో అనేక ప్రైవేటు సం స్థలు నిర్వాహణా సా మర్థ్యం లేక నష్టాల బారిన పడ్డాయి. వాయిదా నిధులు కూడా సకాలంలో చెల్లించని దశకు చేరుకున్నాయి. 2011కి 68.5 శాతం వృద్ధి అయినప్పటికీ, 2022కి తీవ్ర నష్టాలను ఎదుర్కొన్నాయి. దీంతో ఉద్యోగాలలో కోత విధించారు. విమానాశ్రయాలపై ఆధారపడి జీవించే వారికి కూడా ఉపాధి అవకాశాలు తగ్గాయి. పైగా ప్రయివేట్ రంగాలకు ఎంతసేపూ లాభాలపైనే దృష్టి ఉంటుంది. సేవా దృష్టి తక్కువై పొదుపుపై దృష్టి పెడతాయి. ప్రస్తుతం విమానయాన సంస్థలు ప్రయాణికుల సౌకర్యం కంటే లాభాలపై ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి. దాంతో ప్రాంతీయ అసమానతలు మరింత ముదిరాయి. ఇతర ప్రాంతాలతో అనుసంధానం సైతం తగ్గింది.
లాభాలు వస్తే చాలా..?
ఇక ప్రైవేటీకరణకు కారణంగా ఉద్యోగాల సంఖ్యలో కోత విధించారు. ఉద్యోగ భద్రత తగ్గింది. వేతనాలు, ఇతర ఆర్ధిక ప్రయోజనాలు తగ్గాయి. పైలెట్లకు ఇతర సిబ్బందికి పని గంటలు పెరిగాయి. సంస్థ నిర్వహణ వ్యయాలు తగ్గించడం కోసం విమాన సిబ్బందికి తగిన శిక్షణ లేకపోవడంతో ప్రమాదాలకు దారితీస్తున్నాయి. ప్రైవేటీకరణతో పర్యావరణ సమస్యలను గౌరవించకపోవడం వల్ల కార్బన్ ఉద్గారాలు పెరిగాయి. స్థిరమైన విధానాల లేమితో సమర్థవంతమైన ఇంధన నిర్వహణ తగ్గింది. కార్పోరేటీకరణతో అసమాన అభివృద్ధి జరుగుతుంది. ప్రైవేటీకరణ వల్ల కొన్ని ఎయిర్‌లైన్స్ కు లాభాలు వస్తున్నాయి. ఇతర సంస్థలు కష్టాలను, నష్టా లను ఎదుర్కొంటున్నాయి. ఈ రంగంలో విదేశీ యాజమా న్యం, నియంత్రణ మూలంగా డేటా భద్రతా లోపాలు వస్తు న్నాయి. ఇవి అంతర్జాతీయ ఒత్తిడికి లోనయ్యే ప్రమాదం ఉంది. ప్రైవేటీకరణ కారణంగా ప్రభుత్వ పర్యవేక్షణ తగ్గ డంతో బాధ్యతారహిత వైఖరి, అవినీతి పెరిగింది. నిరంకుశ మోనోపోలీల ఏర్పాటుతో మరికొన్ని సమస్యలు ఉన్నాయి.
ప్రైవేటీకరణకు ప్రత్యామ్నాయాలు..
భారత పౌర విమానయాన రంగంలో ప్రైవేటీకరణ వల్ల తీవ్రమైన ప్రతికూల ప్రభావాలు తలెత్తాయి. ఆర్థిక వృద్ధికి సామాజిక బాధ్యతకు మధ్య సంతులనం కాపాడడం ముఖ్యం. ప్రత్యామ్నాయాలు, పరిష్కారాలను అమలు చేయ డం ద్వారా భారతదేశం తన పౌర విమానయాన రంగాన్ని పునరుద్ధరించవచ్చు. జాతీయ ప్రయోజనాలు, కార్మికుల సంక్షేమం పర్యావరణ స్థిరత్వాన్ని ప్రాధాన్యం ఇవ్వడం కోసం ప్రయత్నించవచ్చు. దేశానికి పౌర విమానయాన రంగం కీలకమైనది. దేశ అభివృద్ధికి అవసరం. ప్రైవేటీకరణ ధోరణి ఈ రంగాన్ని విదేశీ కార్పొరేట్ సంస్థలకు మార్గం సుగమం చేస్తుంది. దీన్ని అడ్డుకోవడం అత్యవసరం.
డా. కోలాహలం రామ్ కిశోర్
98493 28496