యువతపై సోషల్ మీడియా ప్రభావం..

దేశంలో సోషల్ మీడియా వాడకం మన నిత్యజీవితంలో ఒక అవసరంగా ఏర్పడింది. ప్రపంచంలో ఏ మూలన ఏమి జరుగుతున్నా వివిధ అంశాలను

Update: 2024-06-26 01:00 GMT

దేశంలో సోషల్ మీడియా వాడకం మన నిత్యజీవితంలో ఒక అవసరంగా ఏర్పడింది. ప్రపంచంలో ఏ మూలన ఏమి జరుగుతున్నా వివిధ అంశాలను, ముఖ్యంగా యువతను ఇది గణనీయంగా ప్రభావితం చేస్తోంది. ఈ ప్లాట్‌ఫారమ్‌లు మన కమ్యూనికేషన్, మన అభిప్రాయాన్ని వ్యక్తపరచడానికి, సమాచారాన్ని ప్రతీ ఒక్కరికీ తెలియజేసే అవకాశాలను పెంచుతున్నాయి. కానీ కొన్ని సందర్భాల్లో అవి మానసిక ఆరోగ్యానికి కూడా ప్రమాదాన్ని కలిగిస్తాయి. సోషల్ మీడియా భారతీయ యువతకు అనేక ప్రయోజనాలను అందిస్తున్నప్పటికీ, దాని ఉపయోగంలో ముఖ్యమైన ప్రతికూలతలు, సవాళ్లు కూడా ఉన్నాయి. సోషల్ మీడియాను రోజుకు 3 గంటలకన్నా ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఆందోళన, డిప్రెషన్‌లకు దారితీయవచ్చు.

ఇటీవల ఒక కథనం ప్రకారం 2024లో, భారతదేశంలో సోషల్ మీడియా వాడకం గణనీయంగా పెరిగిందని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా వినియోగిస్తున్న వారిలో భారతదేశం వాటా 32.2% అంటే 46 కోట్ల మంది మనదేశంలో సోషల్ మీడియా వినియోగదారులున్నారు.

సామాజిక అవగాహన కోసమైనప్పటికీ..

సోషల్ మీడియా సామాజిక, రాజకీయ, పర్యావరణ సమస్యలపై అవగాహన పెంచడానికి ఒక శక్తివంతమైన సాధనం. భారతీయ యువతలో ఇవి గణనీయమైన ఫాలోయింగ్ కలిగి ఉన్నాయి. ఈ ప్లాట్‌ఫారమ్‌లు యువ వ్యాపారవేత్తలకు ఉత్పత్తులను, సేవలను విక్రయించడానికి మార్కెట్‌ను అందిస్తాయి. ఫ్రీలాన్సింగ్ ఎకానమీ, లింక్డ్‌ఇన్ వంటి సైట్‌లు, అప్‌వర్క్ వంటి ప్రత్యేక ప్లాట్‌ఫారమ్‌లు యువతకు ఫ్రీలాన్స్ వర్క్, పని చేసే అవకాశాలను కనుగొనడంలో సహాయపడతాయి. యూట్యూబ్, బ్లాగింగ్, వ్లాగింగ్, మార్కెటింగ్ చేస్తూ డబ్బును సంపాదిస్తున్నారు.

సోషల్ మీడియా భారతీయ యువతకు అనేక ప్రయోజనాలను అందిస్తున్నప్పటికీ, దాని ఉపయోగంతో అనేక ముఖ్యమైన ప్రతికూలతలు, సవాళ్లు కూడా ఉన్నాయి. వీటితో పాటు మానసిక ఆరోగ్య సమస్యలు (డిప్రెషన్) సోషల్ మీడియాను రోజుకు 3 గంటలకన్నా ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఆందోళన, డిప్రెషన్ భావాలకు దారితీయవచ్చు. ఇతరులు వారి జీవన శైలిలతో తమ జీవితాలతో పోలిక వల్ల తాము తక్కువ అనే స్థాయికి జీవితాలు దిగజారుతున్నాయి. సైబర్ మోసాలు, బెదిరింపు భారతీయ యువత ఆన్‌లైన్ వేధింపులకు, బెదిరింపుల వల్ల తీవ్రమైన మానసిక క్షోభకు గురవుతున్నారు. దీని వాడకం వ్యసనంగా మారి మన రోజువారీ కార్యకలాపాలకు, బాధ్యతలపై ప్రభావితం చేస్తుంది.

తప్పుడు సమాచారం వ్యాప్తి

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు తప్పుడు సమాచారాన్ని వేగంగా వ్యాప్తి చేయగలవు, ఇది అపోహలకు, కొన్నిసార్లు ప్రమాదకరమైన చర్యలకు దారితీస్తుంది. ఈ మధ్య మనుషుల మధ్య కమ్యునికెషన్ తగ్గి వర్చువల్ కమ్యూనికేషన్‌పై అతిగా ఆధారపడటం అనేది ఎక్కువ అయింది. ఇది మనలను సామాజికంగా ఒంటరిగా మన చుట్టూ ఉన్న బంధాలను విచ్ఛిన్నం చేస్తుంది సోషల్ మీడియా నోటిఫికేషన్‌లు విద్యార్థులను వారి చదువుల నుండి దూరం చేస్తుంది. అర్ధరాత్రి సోషల్ మీడియా వినియోగం నిద్రకు అంతరాయం కలిగించి, విద్యార్థులపై ప్రతికూల ప్రభావితం చేస్తుంది. దీనిని అధికంగా ఉపయోగించడం వల్ల మనం అధ్యయనం చేయాల్సిన స్కిల్స్, మనలో ఉత్పాదకత పెంచగల నైపుణ్యం అభివృద్ధి వంటివాటిపై వెచ్చించాల్సిన విలువైన సమయాన్ని వృధా చేసుకోవడమే అవుతుంది. యువతను ఆకర్షించే విధంగా ఆన్లైన్ గేమ్స్, ఆన్‌లైన్ స్కామ్‌లు వలలో పడి, వారిపై తీవ్ర మానసిక ఒత్తిడికి కారణం అవుతుంది, అదేగాక ఆత్మహత్యల దిశ గానో, సైకోటిక్ బిహేవియర్ పెరిగి సమాజానికి యువతే ప్రమాదకారి అయ్యే విధంగా చేస్తుందనడంలో సందేహం లేదు.

కొలను వెంకటేశ్వర రెడ్డి

93469 95566

Tags:    

Similar News