ప్రమాదంలో ఆర్థిక రక్ష.. రైల్వే బీమా

How IRCTC's 35 paise travel insurance works and claim process

Update: 2023-06-07 01:00 GMT

డిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మృతుల్లో తెలుగువాళ్లే దాదాపు 120 మంది ఉన్నారని తెలుస్తోంది. చనిపోయిన వారిలో, కుటుంబం మొత్తానికి జీవనాధారమైన వ్యక్తులు కూడా ఉండవచ్చు. వాళ్ల మరణంతో ఆ కుటుంబం ఆర్థిక, సామాజిక పరిస్థితి ఒక్కసారిగా తల్లకిందులవుతుంది. ఈ పరిస్థితుల్లో, ట్రైన్ ట్రావెల్ ఇన్సూరెన్స్ ఆర్థికంగా ఆదుకుంటుంది. దీనికి అయ్యే ఖర్చు కూడా నామమాత్రం. కేవలం 45 పైసల ఖర్చుకే రూ. 10 లక్షల బీమా అందుతుంది.

మీరు తరచుగా అరుదుగా రైలు ప్రయాణం చేస్తుంటే, కచ్చితంగా ట్రావెల్ ఇన్సూరెన్స్ ఆప్షన్ ను ఎంచుకొండి దీనివల్ల, కేవలం 45 పైసలకే రూ.10 లక్షల బీమా కవరేజ్ అందుతుంది. రైలు ప్రయాణ సమయంలో దురదృష్టవశాత్తు ఏదైనా ప్రమాదం జరిగితే, ఆ బీమా డబ్బు మీ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలుస్తుంది. ఆన్‌లైన్‌లో రైలు టిక్కెట్లను టపాటపా బుక్ చేసుకునే పాసింజర్లలో చాలామంది ట్రావెల్ ఇన్సూరెన్స్ ఆప్షన్ ఎంచుకోవడం లేదు. ఏం కాదులే అన్న నిర్లక్ష్యం ఒక కారణమైతే, అసలు అలాంటి ఆప్షన్ ఒకటి ఉందని తెలియకపోవడం మరొక ప్రధాన కారణం. బీమా కోసం చెల్లించాల్సిన మొత్తం ఒక్క రూపాయి కన్నా తక్కువే కాబట్టి, పోతేపోనీ ఒక్క రూపాయి అనుకోండి. మన చేతుల మీదుగా ఎన్ని రూపాయలు వృధాగా ఖర్చు కావడం లేదు, కానీ, ఇది మాత్రం వృధా కాదు, ఆర్థిక రక్ష. దురదృష్టవశాత్తు ఒడిశా లాంటి సంఘటనలు జరిగినప్పుడు, మరణించిన వ్యక్తి కుటుంబానికి 10 లక్షల రూపాయల వరకు కవరేజ్ అందుతుంది. గాయపడిన వారికి కూడా బీమా కవరేజ్ ఉంటుంది.

నామినీ పేరు తప్పనిసరి

ఇక రైలు ప్రయాణం కోసం ఆన్‌లైన్ లో టికెట్ బుక్ చేస్తున్నప్పుడు ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో ఇన్సూరెన్స్ ఆప్షన్ కనిపిస్తుంది ఆ ఆప్షన్ ఎంచుకుంటే తర్వాత మీ మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీకి లింక్ వస్తుంది. ఆ లింక్‌ను బీమా సంస్థ పంపుతుంది. లింక్ మీద క్లిక్ చేస్తే మరో పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ నామినీ వివరాలు తప్పనిసరిగా పూరించాలి. ఎందుకంటే బీమా పాలసీలో నామినీ పేరు ఉంటే బీమా క్లెయిమ్ పొందడం సులభం అవుతుంది.

రైల్వే ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉన్న సందర్భంలో రైలు ప్రయాణీకుడికి ఏదైనా ప్రమాదం జరిగి ప్రయాణికుడు మరణిస్తే 10 లక్షలు, అంగవైకల్యం చెందితే 10 లక్షలు, పాక్షిక అంగవైకల్యానికి 7.5 లక్షలు, గాయాలైతే రూ.2 లక్షలను ఆసుపత్రి ఖర్చులుగా చెల్లిస్తుంది. వీటిని రైలు ప్రమాదం జరిగిన 4 నెలల లోపు క్లెయిమ్ చేసుకోవచ్చు. దీనికోసం బీమా కంపెనీ కార్యాలయాన్ని వెళ్లి, వాళ్లు అడిగిన వివరాలు, పత్రాలు సమర్పించి బీమా మొత్తాన్ని పొందవచ్చు.ఇప్పటిదాకా భారతీయ రైల్వే అందిస్తున్న ఈ సౌకర్యాన్ని మీరు గతంలో పెద్దగా పట్టించుకోకపోయి ఉండవచ్చు. ఇకపై మాత్రం మరిచిపోవద్దు. మీరు చూపే చిన్నపాటి శ్రద్ధ, మీ కుటుంబం మొత్తానికి ఆర్థిక రక్ష.

కొలనుపాక కుమారస్వామి

99637 20669

Tags:    

Similar News