యువతలో మార్పు కోసం..

For change in youth..

Update: 2024-08-17 00:30 GMT

నేటి సమాజంలో యువత ఎక్కువగా మత్తు పదార్థాలు, మద్యానికి బానిసలుగా మారుతూ భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారు. మత్తు పదార్థాలకు బానిసలుగా మారి నేర ప్రవృత్తి వైపు ఆలోచనలు చేస్తూ అనేక నేరాలకు పాలుపడుతూ వారి కుటుంబాలను, వ్యవస్థను కలుషితం చేస్తున్నారు. చట్టాలు, వ్యవస్థలు యువతలో మంచి మార్పులు తీసుకు రాలేక పోతున్నాయి. నేటి యువత ఆలోచనలకూ అనుగుణంగా చట్టాలలో మార్పులు చేయకపోవడం కూడా ఒక ప్రధాన కారణం. మార్పులను స్వీకరించి అమలు చేయకపోతే విద్యావ్యవస్థ పతనానికి దారితీస్తుంది. ప్రతి కాలేజీలో నెలకు ఒక్కసారి చెడు అలవాట్ల మీద, భవిష్యత్తు పట్ల ఉండాల్సిన బాధ్యతల పట్ల అవగాహనా సదస్సులు నిర్వహించాలి. అలానే ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అన్ని కాలేజీలు, యూనివర్సిటీలను స్థానిక పోలీస్ సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తే.. కొంతవరకు సత్పలితాలను పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ ఆధ్వర్యంలో ఇంటర్ నుంచి పి.జి స్థాయి కాలేజీలలో విద్యనభ్యసిస్తున్న కొందరికి అదే కాలేజీ ప్రాంగణంలో రక్త నామూలలను సేక రించి విద్యార్థి ఎలాంటి మత్తు పదర్థాలు, చెడు వ్యసనాలకు అలవాటు పడ్డాడేమో కనిపెట్టవచ్చు. ఇలా మెడికల్ చెకప్ చేయడం వలన ప్రతి విద్యార్థి చెడు మార్గాలవైపు వెళ్లకుండా నిరోధించడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులు చెడు వ్యసనాలకు అలవాటు అయితే ఆ విద్యాసంవత్సరం చదవకుండా నిరోధించాలి. అప్పుడే మిగితా విద్యార్థులను కాపాడినట్టు అవుతుంది. దీనివల్ల అటు తల్లిదండ్రులకు పిల్లల ఆరోగ్యం విషయం తెలుస్తుంది. ఇటు ప్రతి విద్యార్థి చెడు వ్యసనాలకు దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాలేజీలలో ఏమైనా లోపాలు ఉంటే ప్రభుత్వ దృష్టికి వస్తుంది. చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులు ఇందులో చెడు కోణం వెతకకుండా మంచి మార్పులను స్వీకరించగలగాలి.

-డా. వై. సంజీవ కుమార్,

ఫౌండర్, స్కై ఫౌండేషన్.

94936 13555


Similar News