కరోనా మింగిన విద్యా ప్రమాణాలు
కరోనా మింగిన విద్యా ప్రమాణాలు ... Education standards collapsed by Corona
మన దేశంలో ప్రాథమిక విద్యా ప్రమాణాలపై ఎప్పటికప్పుడు సర్వే చేస్తున్న ప్రతిష్టాత్మక సంస్థ ప్రథమ్ విడుదల చేసిన తాజా గణాంకాలు (ఆసర్ సర్వే) విద్యపై కరోనా దెబ్బ ఎంత బలంగా వుందో తెలియజేస్తున్నాయి. రెండేళ్ల తర్వాత ఆరు వందల జిల్లాల్లో ఏడు లక్షల మంది విద్యార్థుల్ని పరిశీలించి తయారుచేసిన ఆ నివేదిక ప్రకారం విద్యార్థుల్లో అభ్యసనం, గణితంలో ప్రతిభా సామర్ధ్యాలు దశాబ్ద కాలం నాటి స్థితికి దిగజారి వెనకబడ్డాయి. రెండేళ్లు కరోనా కారణంగా మూతపడిన బడులు, అటకెక్కిన చదువులు ఈ దుస్థితికి కారణం.అయితే విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్ ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో పెరగడం శుభసూచకం. ఇప్పుడు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ విద్యపై ప్రత్యేక దృష్టి సారించాలి. కోల్పోయిన విద్యా ప్రమాణాలు త్వరగా సాధించేందుకు, ప్రమాణాలు పెరిగేటందుకు కృషి చెయ్యాలి. ఉపాధ్యాయులతో పాటు తలిదండ్రులను విద్యాయజ్ఞంలో భాగస్వాముల్ని చెయ్యాలి. ప్రాథమిక విద్య వ్యక్తిగత, వ్యవస్థాగత ఎదుగుదలకు పునాది కాబట్టి శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రంగంలో చేస్తున్న కృషి అభినందనీయం.
- డా. డి.వి.జి.శంకరరావు , మాజీ ఎంపీ, పార్వతీపురం
Also Read...